లక్ష్మీ రావే మా ఇంటికీ.. వరలక్ష్మీ రావే మా ఇంటికీ ...

7:31 PM Edit This 3 Comments »

ఈ ఏడాది మా వరలక్ష్మీ దేవి
ఈసారి కూడా చాలా బాగా చేసుకొన్నాను,
ఉదయం పూజ చేసినంత చేపు అమ్మమ్మ ,తాతయ్య చాల సార్లు గుర్తుకొచ్చారు ,
అమ్మ పూజ చేసు కొనేప్పుడు వస్త్రం, యజ్ఞోపవితం, తోరాలు ఇవన్నీ అమ్మమ్మే చేసేది, ఆవిడే పెద్దది కాబట్టి అందరికీ ఆవిడే తోరాలు కట్టేది. ఆవిడా తరువాత నుంచి అమ్మ మొన్నటి దాగా చేసేది ,ఇప్పడు ఆ ఆపని మా వారు చేయవలసి వచ్చింది :)
నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తాతయ్యే పూజ చేయించే వారు , మా ఇంట్లోనే కాదు మా పిన్ని ,అత్తా ...అందరికి ఈనఒక్కరే...!! మరి అంత డిమాండు ఆయనకి
మా తాతయ్య అని చెప్పడం కాదు కానీ వ్రతం చివరిలో వచ్చే కథ చదవాలంటే ఆయనకు ఆయనే సాటి
ఆ కథలోని సన్నీ వేశాలన్ని కంటి ముందు కనిపిస్తాయి ,
ఈ రెండేళ్ళ నుంచి దాన్ని చాలా మిస్ అయ్యాను :(
కానీ పెళ్ళయాక నాకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కోరిక తీరింది
అదేమిటో తెలుసా ...
నేనే కళిశాన్ని చేయడం :)
అమ్మ ఎప్పుడూ మడి, ముట్టుకూకు, అంటూ కోప్పడేది , కానీ ఎప్పుడూ మనదే రాజ్జం :)
అన్నీ మనమే చేసుకోవచ్చు .
మరి ఎలా ఉంది మా వరలక్ష్మీ దేవి .....!!!!!!!!!!!

వరలక్ష్మీ వ్రతం

4:32 PM Edit This 3 Comments »

పోయిన ఏడాది వరలక్ష్మీ వ్రతం ఫోటోలు
చాల బాగా చేసుకున్నాము


నాకు చాలా చాలా నచ్చిన వ్రతం . నా చిన్న నాటి నుంచి ఎప్పుడూ ఎంతో వేడుకగా జరుపుకొనే పండుగ ఇది,
పెళైన వెంటనే ఎక్కడికి వచ్చేయటంతో వాయనం ఇవ్వటానికి ,పేరంటానికి కొంచం ఇబ్బంది పడ్డాను .
కానీ నా అదృష్టం మా పక్క వాటాలోనే తెలుగు వాళ్ళు, అదీకాక మన వాళ్ళే ఉన్నారు . ఆవిడకు ఇవ్వటంతో గత ఏడాది నా వ్రతం ఎటువంటి ఇబ్బంది లేకుండా ముగిసింది .
ఈ ఏడాది ఎలా జరుగుతుందో మరి ...

గ్రామీణ భారతం

10:33 PM Posted In Edit This 8 Comments »


అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఈ దృశ్యాలు ఇప్పటి గ్రామాల్లో చూడలేమనుకుంటా :(
అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఈశ్వరవాక
నేను చిన్నదానిగాఉన్నపుడు వేసవి సెలవలకి ఆ ఊరు వెళ్ళేవాళ్ళం
నాకు ఉదయం నుంచి రాత్రి 8 వరకు ఆ ఊరులోనే ఉండాలనిపించేది ఆ తర్వతకదా అమ్మగుర్తుకువచేది ఇక అదిమొదలు తెల్లవారుజామువరకు ఏడుపు :)
కానీ అవ్వ మాత్రం వంట చాలా బాగా చేస్తుంది , అమ్మ కూడా అవ్వదగ్గరే వంట , ఇంటి పనులు ,ఇల్లు అలకడం లాంటి పనులన్నీ చేయడం నేర్చుకుందట ఆ మాట చెప్పి నన్ను పని నేర్చుకోమని చంపేసేది
ఏ పనిచేప్పినా చేసేదాన్ని కాదు గానీ మజ్జిగచిలకడం మాత్రం ఎప్పుడూ చెబుతుందా అన్నట్లు చూసేదాన్ని
ఎందుకంటే ఈ బొమ్మలో ఉందే అలాటి గొల్లభామ కవ్వం ఉండేది , దాంతో మజ్జిగ చిలకడమంటే నాకు మహా సరదా అంతేకాదు దాన్లో వెన్న చాలా త్వరగా చాలా ఎక్కువ వస్తుంది చిలికినట్టి చిలికి మొత్తం తినేసేదాన్ని అడిగితే నేను కాదు
నేను చిలికి గిన్నెలో వేసి ఆడుకోడానికి వెళ్ళాను ఈలోపల పిల్లివచ్చి తినేసింది అని చెప్పేదాన్ని
అప్పుదందరూ నవ్వి ఆ తెల్లపిల్లి కదా... రెండు కాళ్ళుంటాయ్ , రెండు పిలకలుంటయ్ అదేనా అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు
వలింట్లో ఉయ్యాలబల్ల కూడా ఉండేది దానిమీద కూర్చోవటానికి ఉన్న ఆరుమండివి పోటీపడేవాళ్ళం
అయినా ఆరోజులే వేరు
మళ్ళీ ఆ రోజులు రమ్మన్నా రావు
మనకి పెళ్ళికాకముందు ఎలా ఆ రోజులు అంతగా గుర్తురావు ఎక్కుడైతే పెళ్లి చేసుకొని ఇంటికి ఊరికి దూరం అవుతామో అప్పుడు తెలుస్తుంది ఆ బాధ :( ఏవిటో హ్మ్
ఇంతకీ అడగడం మరిచా ఈ బొమ్మ ఇలా ఉంది ?? నే వేశా :)

INCEPTION

5:47 PM Edit This 2 Comments »
మొన్న శనివారం ఈ సినిమాకి వెళ్ళాం .
మొదటంతా అసలుఅర్దంకాలే,ఏవిటో ,ఈ కలలేవిటో,ఆ కలలోంచి ఇంకో కలలోకి వెళ్ళటాలేవిటో అబ్బబ్బ ... నాకుతెలిసీ నా జీవితంలో సినిమా హాల్ లో నిద్రతెప్పించిన సినిమా ఇదే.
ఇదిగో ఈ మెట్లు

చూసినప్పుడు ఇదేదో చాలా బాగుందని కొంచం మనసు పెట్టి చూసా . కొంచం అర్దమయ్యి కానట్టు అనిపిచింది .మా వారు మాత్రం చాలా లీనమైపోయి చూస్తున్నారు. నాకా తెలుగు సినిమాలు చుట్టం అలవాటై ఈ ఇంగ్లీషు సినిమాలల్లో ఒక్క మాట అర్దం కాకపోయినా మనసు నిలవదు, దాని అర్దం ఎవిటో మా వారిని చెప్పేదాకా తినేస్తాను.కానీ ఈ సినిమాలో అలా అదిగితే కొట్టేస్తారేమో అన్నట్టు చూస్తన్నారు...:)
అయినా ఏదో అర్ధమయ్యి ,కానట్టు చూసానులెండి
కానీ ఈ ఊహ చాలా బాగుందనిపిస్తుంది . మనిషి నిజ జీవితంలో చేయటానికి, చూట్టానికి అలవికానివి కలల ద్వారా సాధించవచ్చు అని అనిపించింది .
కానీ ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయ్........:)

మా బుజ్జి బొజ్జ గణపయ్య

3:44 PM Posted In Edit This 1 Comment »
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||
రాబోయే వినాయక చతుర్ధికి తయారైన మా బుజ్జి బొజ్జ గణపయ్య
పోయిన ఏడాది చివరి నిమిషంలో వినాయకుని పటం కోసం చాలా కంగారుపడ్డాం. విగ్రహం కొన్నాం కానీ పటం కొనడం మరిచాం. చివరి నిమిషంలో ఒక చిన్న వినాయకుని ఫోటోని ప్రింట్ తీసుకొని దాన్ని పెట్టి పూజ చేసేశాం. అందుకే ఈ సారి కొంచం త్వరగా నేనే నాకు తెలిసిన acylic paints తో ఈ బుజ్జి జేజాని పైంట్ చేశా
ఈ విఘ్ననాధుడే ఈ ఏడాది మా ఇంట కొలువుతీరబోతున్నారు