INCEPTION

5:47 PM Edit This 2 Comments »
మొన్న శనివారం ఈ సినిమాకి వెళ్ళాం .
మొదటంతా అసలుఅర్దంకాలే,ఏవిటో ,ఈ కలలేవిటో,ఆ కలలోంచి ఇంకో కలలోకి వెళ్ళటాలేవిటో అబ్బబ్బ ... నాకుతెలిసీ నా జీవితంలో సినిమా హాల్ లో నిద్రతెప్పించిన సినిమా ఇదే.
ఇదిగో ఈ మెట్లు

చూసినప్పుడు ఇదేదో చాలా బాగుందని కొంచం మనసు పెట్టి చూసా . కొంచం అర్దమయ్యి కానట్టు అనిపిచింది .మా వారు మాత్రం చాలా లీనమైపోయి చూస్తున్నారు. నాకా తెలుగు సినిమాలు చుట్టం అలవాటై ఈ ఇంగ్లీషు సినిమాలల్లో ఒక్క మాట అర్దం కాకపోయినా మనసు నిలవదు, దాని అర్దం ఎవిటో మా వారిని చెప్పేదాకా తినేస్తాను.కానీ ఈ సినిమాలో అలా అదిగితే కొట్టేస్తారేమో అన్నట్టు చూస్తన్నారు...:)
అయినా ఏదో అర్ధమయ్యి ,కానట్టు చూసానులెండి
కానీ ఈ ఊహ చాలా బాగుందనిపిస్తుంది . మనిషి నిజ జీవితంలో చేయటానికి, చూట్టానికి అలవికానివి కలల ద్వారా సాధించవచ్చు అని అనిపించింది .
కానీ ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయ్........:)

2 comments:

Pranav Ainavolu చెప్పారు...

అవునండీ... కేక movie అసలు.
నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ కలలేంటి... కలలో మళ్ళి కలలు కనదమేంటి... సూపర్ అసలు!

lakshmi sravanthi udali చెప్పారు...

:)