పాడుతా తీయ్యగా

12:30 PM Posted In Edit This 3 Comments »
ఆ పేరు వినగానే మనందరికీ గుర్తోచ్చేపేరు బాలుగారు ఇంకా
పపప..మమమ..రిరిరి..రిసమరి
పపప..మమమ..రిరిరి..సరిరిస
స్వరాలపనే సరాగాలుగా
శృతీ లయలలో జగాలూగగా
సుధానాదమే యదేమీటగా
రసానందమే అలై పొంగగా
ప్రాణాలు పులకించగా అ అ అ ...
మౌనాలు రవళించగా
ఇవే కదా మనందరికీ గుర్తొచ్చేవి :)
కానీ ఈ మద్య చాలా మంది దగ్గర వింటున్నాను , ఇప్పుడు వచ్చే పాడుతా తీయ్యగా అంత బాగు లేదు అని
కానీ నేను దానితో ఏకీభావించను.
ఎందుకంటే ఇప్పుడు అన్ని చానల్స్ లో ఈ పాటల సందడి పెరిగి పోయింది .
కానీ ఇలాంటివి ఎన్ని చేసినా దీని ముందు దిగదుడుపే.
దాని స్థానం ఎప్పుడూ అక్కడుంటుంది, దానిని చేరటం సాధ్యపడే విషయం కాదు.
ఎందుకంటే దీనిలో వెకిలి వేషాలు, వెకిలి చేష్టలు ఉండవ్ . ఎన్నో మంచి విషయాలే కాక తెలుగుని తెలుగులా ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని గ్రహించవచ్చు. పిల్లలు కూడా ఎంతో పద్దతిగా ఉంటారు (ఆ ప్రోగ్రాం లో ).
మిగిలిన ఏ ఛానల్ లో ఇన్నిమంచి విషయాలు చూడ గలమా చెప్పండి.
ఇది ఒక పక్కన ఉంచితే
పిల్లలు కొంచం బాగా పడితే చాలు ఆహా ..వోహో..అంటూ వాళ్ళని అందలానికేత్తేయ్యడం . ఇది ఒక విధమైతే ,
పిల్లలు కొంచం తప్పు పాడినా వాళ్ళు అక్కడే ఏడ్చేలాతిట్టటం. అంతటితో ఆగదండోయ్ వాళ్ళు ఏడ్చేటప్పుడు వెనక నుంచి మ్యూజిక్
హ్మ్..ఏవిటో.
ఇలాంటి దృశ్యాలు పాడుతా తీయ్యగాలో చూడగలమా?
ముఖ్యంగా అవతలి మనిషిని గౌరవించాలి , ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి , ఎలా మందలించాలి అనేవి ఆ వ్యక్తినుంచి మనం తప్పక అలవరుచుకోవలసిన విషయాలు.
ఇవన్నీ అందరూ ఒప్పుకుంటారని నాకు తెలుసు :)
కానీ నన్ను చాలా మంది అడిగింది న్యాయనిర్ణేతల గురించి
ఆ విషయానికొస్తే ఒక్క యన్.టి.ఆర్ అభిమానులైనా ఇద్దరు, ముగ్గురు వారిని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఏవిషయంలో తక్కువ. వెంకటేష్ అంటారా.. అతను కూడా చాలా మంచి చిత్రాలే కదా తీశాడు, ఎ వయసు తక్కువనుకున్తున్నారా ? :)
వాళ్ళ అన్న సురేష్ బాబుని అంటారా.. అతను కూడా ఒక గొప్ప పేరు గల సమస్థకు యజమానే కదా.
బాపు గారు , రమణ గారు , రాజన్ నాగేంద్ర గారు, పి.బి. శ్రీనివాస్ గారు, ఇలా ఎంతోమంది గొప్ప వ్యక్తులని మనం కేవలం ఈ పాడుతా తీయ్యగాలోనే చూడగలం
ఏది ఏమైనా పాడుతా తీయ్యగా ద్వారా మనకు ఇంత మంచి సంగీతాన్ని అందిస్తున్నబాలు గారికి శిరస్సు
వంచి పాదాభివందనం చెయ్యాలి
సర్వే జనా సుఖినో భవంతు
సర్వే సుజనా సుఖినో భవంతు

3 comments:

పరిమళం చెప్పారు...

నేనూ ఆ ప్రోగ్రాం చూస్తానండీ ...బావుంటుంది.

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

ఇంకొన్నివారాల్లో బాలగాంధర్వం మొదలవబోతోంది. అప్పుడుచూడు దాని అస్సలుకథ. మిగతాప్రోగ్రాంలు ఏదోటైంపాస్ కోసం ఎంజాయ చెయ్యడానికి బావుంటాయి. నిజంగా సంగీతం, సాహిత్యంమీద అభిమానం ఉన్నవాళ్ళకి, పాటలకు సంబంధించి విలువైన సమాచారం తెలుసోవాలనుకునేవాళ్ళకి దీన్నిమించిన ప్రోగ్రాంలేదు

కమల్ చెప్పారు...

హమ్మయ్యా..ఈ విషయంలో నేనొక్కడినే అనుకున్నా..నాలాంటి వారు ఉన్నారని మీ పుట చూసాక సంతోషమేసింది..! ఎప్పటికీ " పాడుతా తీయగా " కార్యక్రమమే అన్ని చానల్లో వస్తున్న కార్యక్రమాలకంటే అత్యంత ఎత్తైన శిఖారాన ఉంటుంది..! అది నిజం..! నేను కూడ ఉడతాభక్తిగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్న..మీరు చెప్పిన సురేష్ బాబు, వెంకటేష్, ఇక యన్.టి.ఆర్ అభిమానులైన న్యాయనిర్ణేతులైనవంటి కార్యక్రమాలలో..మరో విషయం చెప్పాలంటే ఆ న్యాయనిర్ణేతలుగా వచ్చినవారు చాలా చాలా మనకు తెలియని మంచి విషయాలు చెప్పారు..కాని కార్యక్రమమ సమయబావం వలన వాటిని ఎడిట్ చేసారు. ఇక యన్.టి.ఆర్ గురించి చెప్పినవారిలో.. వారు చెప్పింది వింటే నిజమే అనిపిస్తుంది..అవి వారి వారి.. నిఖ్ఖిచ్చిమైన అనుభవాలు...! కేవలం యన్.టి.ఆర్ అంటే సరిపోనంతమాత్రాన వాస్తవాలు ..వాస్తవాలు కాకుండా పోతాయా..?