ఇలా పెంచి చూడండి...!

3:49 PM Posted In Edit This 4 Comments »

నాకు మొక్కలు పెంచడమంటే చాలా సరదా . ఇంట్లో అన్నీ చెట్లూ పెంచాలనుకొనే దాన్ని , కానీ కొన్ని చెట్లు ఎన్ని సార్లు వేసినా సరిగా వచ్చేవి కావు. అవి మళ్లీ వేసినప్పుడల్లా అమ్మ తిడుతూ ఉండేది, ఎందుకు వాటికి డబ్బు తగలేస్తావు అని కానీ ఇప్పుడు నాకు దానికి మంచి సలహా లభించింది మన ఈ టి.వి. లో వచ్చే అన్నదాత పుణ్యమా అని ..
వాటిని తెలుసుకున్న వెంటనే ఆ మొక్కలను తీసుకు వచ్చి పెంచేయ్యలని పించింది :)
కానీ నేనిక్కడెక్కడో ఉండిపోతినాయే ..:( ఎమ్ చేద్దాం చెప్పండి. ఇక్కడ ఆ చెట్లు, మొక్కలు దొరికి చావవాయే. అప్పటికి ఇక్కడ దొరికే మొక్కలు, ఆకుకూరలు కొన్ని పెంచుతూనే ఉన్నాను. కానీ ఏ ఆరు, ఏడు కుండీలకు మించి ఈ బాల్కనిలో సరిపోవట్లేదు అందుకే నా ఈ ఆరాటాన్ని మీకు చెబుతున్నాను . మీకు వీలయితే కనీసం మీరైనా వేసుకొని ఆనందించండి :)


మొక్కలు నాటే ముందు మనం ఎన్ని మొక్కలు ఎన్ని కుండీలల్లో లేదా ఎన్ని మడులకింద నాటుతున్నమో చూసుకోవాలి. అటు పిమ్మట ప్రతి కుండీకి 15 kg ల ఎర్రమట్టి , 5 kg ల పశువుల ఎరువు , 1 kg వర్మీకంపోస్టు, 0.5 kg ల వేప పిండి , కలిపి కుండీని పూర్తిగా కాకుండా... కుండీ పై నుంచి 2 అంగుళాల లోతు ఉండే విధంగా నింపుకోవాలి. ఇప్పడు మనకు నచ్చిన పూల మొక్కలనూ , కూరగాయ మొక్కలను , ఆకుకూరలను వేసి పెంచవచ్చు.

నిమ్మ, జామ, మామిడి, బత్తాయి, ......ఇలాంటి చెట్లను కూడా ఇంట్లో ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం .

నేలమీద అయితే 3 అడుగుల మట్టిని 1x1 మీటరు మట్టి తీసివేసి అందులో ఇసుక, మట్టి, వర్మీకంపోస్టు, కలిపి వీటిని నాటుకోవాలి.
town , city లల్లో కింద ఎక్కువ స్థలం ఉండదు కనుక, ఇంటి డాబా మీద 3 అడుగుల ఎత్తు ఉండే తొట్టెలను ఏర్పాటు చేసుకొని అందులో పైన చెప్పిన వాటితో దానిని నింపి అందులో వీటికిని నాటుకోవచ్చు .
ఇలా చేయటం వల్ల ఇంటి లోపల చాలా చల్లగా కూడా ఉంటుంది.

* సంవత్సరానికి ఒకసారి జానెడు మట్టి తీసివేసి 5 kg ల వేప పిండి, 2 kg ల వర్మీకంపోస్టు వేసుకోవాలి.
* కాపర్ ఆక్సీ క్లోరైడ్, గైటాక్స్ అనే మందు నీళ్ళల్లో కలిపి ఆరు నెలలకోసారి చెట్టు మొదల్లో పోయటం వల్ల తెగుళ్ళు రాకుండా నివారించవచ్చు .
* కాపర్ ఆక్సీ క్లోరైడ్ , గైటాక్స్ పేస్టు చేసి చెట్టు మొదలు నుంచి 9 అంగుళాల ఎత్తు వరకు పూయటం ద్వారా కొమ్మ తెగుళ్ళను నివారించవచ్చు .

ఎలా చేయడం వల్ల ఇల్లు అందంగా ఉండటమే కాక కూరల, పండ్ల ఖర్చుని కూడా తగ్గించవచ్చు.
కుండీల క్రింద ప్లేట్లను ఉంచడం వల్ల నేలమీద మరకలు పడకుండా నివారించవచ్చు .
వీటిని పాటించి మీ పెరటిని కూడా అందంగా,ఆరోగ్యవంతంగా, ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను .

లావు తగ్గాలనుకున్తున్నారా.......?

11:33 AM Posted In Edit This 11 Comments »
అయితే ఎలా చెయ్యండి
రోజూ ఉదయం స్నానానికి వెళ్ళేదానికి అరగంట ముందు ఆవ నూనె (mustard oil) , కర్పూరం నీ కలిపి వేడి చేసి మీ శరీరానికి మర్దనా చేయండి.
ఇలా ఒక నలబై రోజుల పాటు రోజూ చేస్తే మీ బరువు తప్పక తగ్గు తుంది.
గమనిక: ఒక కప్పు నూనెకి, నాలుగు కర్పూరపు బిళ్ళలు వేస్తే చాలు.
ఆవనూనె శరీరనికి చాలా మంచిది. దీనిని రాసుకున్న కొద్ది సేపటికే చమట రూపంలో మన శరీరంలో ఉండే కొవ్వు బయటకి వస్తుంది.
ఇది శరీరాన్ని పొడిబారకుండా చేస్తుంది. అంతేకాదు ఆయిల్ మసాజ్ వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
కొన్ని ప్రాంతాలలో దీనిని వంట నూనెగా కూడా వాడుతారు.

శిరోజాల సంరక్షణ కొరకు:
ఈ ఆవ నూనెలో గోరింటాకుని వేసి కాచి తలకు మర్దనా చేస్తే మీ వెంట్రుకలు ఎంతో అందంగా, వత్తుగా పెరుగుతాయి.జుట్టు రాలటాన్ని కూడా నివారిస్తుంది.
ఇది నేను అనుభవం మీద చెబుతున్నాను. దీని వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు
మీరు తప్పక ప్రయత్నించి మంచి ఫలితం పొందుతారని ఆశిస్తున్నాను.

ఆరోగ్యసిరి ఉసిరి.... సర్వలక్షణాల సిరి ఉసిరి

2:29 PM Posted In Edit This 2 Comments »