ముగ్గులే ముగ్గులు మా మాంచి ముగ్గులు

7:12 PM Posted In , Edit This 1 Comment »
ఆ మద్య చెప్పాగదండి ముగ్గులు వేస్తున్నానని ఎప్పుడూ వేసే ముగ్గులేనా అని మార్పు కోసమని కొత్త ముగ్గుల కోసం వెతుకుతుండగా ఈ వెబ్సైటు కంటపడింది. వామ్మో ..! ఎన్ని ముగ్గులో కొన్ని మాములుగా ఉన్నా, ఇంకొన్ని మాత్రం చాలా చాలా బాగున్నాయి. కొన్నిటికి చుక్కలు రాసారు, కొన్నిటికి రాయలేదు. ఆ చుక్కలు రాయని ముగ్గులే నాకు ఎక్కువగా నచ్చేసాయి ఇక చెప్పేదేముంది వాటిని సొంతగా వేసేదానికి ప్రయత్నిస్తున్నాను. కొన్ని మాత్రం బాగానే వేసేశాను. కొన్ని మాత్రం రావట్లేదు :(
http://www.ikolam.com//
మీరూ ప్రయత్నించండి. చాలా బాగున్నాయి. బోలెడన్ని వెరైటీ ముగ్గులు మీ కోసం వేచిచూస్తున్నాయ్ :)
http://www.ikolam.com/node/17343?p=343

ఇది చూడండి, ఎంత బాగుందో..!
మరేమిటి ప్రయత్నిస్తారా ..? :)

గ్రహవీక్షణము కన్న సద్గురువను గ్రహవిక్షణమే మిన్నా...........

1:44 PM Posted In Edit This 2 Comments »



గ్రహవీక్షణము కన్న
సద్గురువను గ్రహవీక్షణమే మిన్నా.......

ఇహము పరము లేటులున్నా..
మహిలో గానము, గానము కన్నా.. ll గ్రహ..ll
మురిపెమలర వినవలేనన్న
మురళీ గానమే మిన్నా.. ll గ్రహ.. ll
రామ కృష్ణుల కన్నా..
ఏమివ్వగలను నేనింత కన్నా... ll గ్రహ.. ll

మొన్న మా టీవీ లో వచ్చిన శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారి కచేరీ చూసి, వినీ నా తనువూ, మనసు పులకరించి పోయాయి.
బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు
ఈ భూమి మీద పుట్టిన మనలాంటి మామూలు మనుషులని సంగీతంతో పునీతం చేయడానికి అవతరించిన గంధర్వులు శ్రీ మంగళం పల్లి వారు
ఆయనకాయనే ఒక ఉపమానం
అంతటి సర్వోతృష్టను మనందరి కోసం అవతరింపజేసిన ఆ పరమేశ్వరునికి ఇవే నా సాష్టాంగ ప్రణామాలు.

మొత్తం కచ్చేరీలో నాకు ఈ గ్రహవీక్షనముకన్న...అన్న పాట మహా బాగా నచ్చింది. దానితో పాటు,
ఎన్ని సార్లు విన్నా తనివితీరని
ఏమిసేతురా..లింగా.. ఏమీ సేతురా... పాట విని తరించి పోయాను
ఈ youtube పుణ్యమా అని ఎప్పుడూ వినాలనిపిస్తే అప్పుడు విని పునీతనవుతున్నాను
నా ఈ జీవిత కాలంలో ఈ లాంటి మహోన్నత వ్యక్తిని కన్నులారా చూసే బాగ్యాన్ని ప్రసాదించమని ఆ పరమేశ్వరునికి వేడుకొంటున్నాను.

పాడుతా తీయ్యగా

12:30 PM Posted In Edit This 3 Comments »
ఆ పేరు వినగానే మనందరికీ గుర్తోచ్చేపేరు బాలుగారు ఇంకా
పపప..మమమ..రిరిరి..రిసమరి
పపప..మమమ..రిరిరి..సరిరిస
స్వరాలపనే సరాగాలుగా
శృతీ లయలలో జగాలూగగా
సుధానాదమే యదేమీటగా
రసానందమే అలై పొంగగా
ప్రాణాలు పులకించగా అ అ అ ...
మౌనాలు రవళించగా
ఇవే కదా మనందరికీ గుర్తొచ్చేవి :)
కానీ ఈ మద్య చాలా మంది దగ్గర వింటున్నాను , ఇప్పుడు వచ్చే పాడుతా తీయ్యగా అంత బాగు లేదు అని
కానీ నేను దానితో ఏకీభావించను.
ఎందుకంటే ఇప్పుడు అన్ని చానల్స్ లో ఈ పాటల సందడి పెరిగి పోయింది .
కానీ ఇలాంటివి ఎన్ని చేసినా దీని ముందు దిగదుడుపే.
దాని స్థానం ఎప్పుడూ అక్కడుంటుంది, దానిని చేరటం సాధ్యపడే విషయం కాదు.
ఎందుకంటే దీనిలో వెకిలి వేషాలు, వెకిలి చేష్టలు ఉండవ్ . ఎన్నో మంచి విషయాలే కాక తెలుగుని తెలుగులా ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని గ్రహించవచ్చు. పిల్లలు కూడా ఎంతో పద్దతిగా ఉంటారు (ఆ ప్రోగ్రాం లో ).
మిగిలిన ఏ ఛానల్ లో ఇన్నిమంచి విషయాలు చూడ గలమా చెప్పండి.
ఇది ఒక పక్కన ఉంచితే
పిల్లలు కొంచం బాగా పడితే చాలు ఆహా ..వోహో..అంటూ వాళ్ళని అందలానికేత్తేయ్యడం . ఇది ఒక విధమైతే ,
పిల్లలు కొంచం తప్పు పాడినా వాళ్ళు అక్కడే ఏడ్చేలాతిట్టటం. అంతటితో ఆగదండోయ్ వాళ్ళు ఏడ్చేటప్పుడు వెనక నుంచి మ్యూజిక్
హ్మ్..ఏవిటో.
ఇలాంటి దృశ్యాలు పాడుతా తీయ్యగాలో చూడగలమా?
ముఖ్యంగా అవతలి మనిషిని గౌరవించాలి , ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి , ఎలా మందలించాలి అనేవి ఆ వ్యక్తినుంచి మనం తప్పక అలవరుచుకోవలసిన విషయాలు.
ఇవన్నీ అందరూ ఒప్పుకుంటారని నాకు తెలుసు :)
కానీ నన్ను చాలా మంది అడిగింది న్యాయనిర్ణేతల గురించి
ఆ విషయానికొస్తే ఒక్క యన్.టి.ఆర్ అభిమానులైనా ఇద్దరు, ముగ్గురు వారిని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఏవిషయంలో తక్కువ. వెంకటేష్ అంటారా.. అతను కూడా చాలా మంచి చిత్రాలే కదా తీశాడు, ఎ వయసు తక్కువనుకున్తున్నారా ? :)
వాళ్ళ అన్న సురేష్ బాబుని అంటారా.. అతను కూడా ఒక గొప్ప పేరు గల సమస్థకు యజమానే కదా.
బాపు గారు , రమణ గారు , రాజన్ నాగేంద్ర గారు, పి.బి. శ్రీనివాస్ గారు, ఇలా ఎంతోమంది గొప్ప వ్యక్తులని మనం కేవలం ఈ పాడుతా తీయ్యగాలోనే చూడగలం
ఏది ఏమైనా పాడుతా తీయ్యగా ద్వారా మనకు ఇంత మంచి సంగీతాన్ని అందిస్తున్నబాలు గారికి శిరస్సు
వంచి పాదాభివందనం చెయ్యాలి
సర్వే జనా సుఖినో భవంతు
సర్వే సుజనా సుఖినో భవంతు

రోబో

10:27 PM Posted In Edit This 6 Comments »
నేను నిన్న మా అన్న పంపిన రోబో సినిమా పాటలు విన్నాను
వాడికి మాత్రం తెగ నచ్చినట్లున్నాయి . అందుకనే ఎక్కడ చూసినా ఓ యంత్రికుడా..అని ఏదో ఏదో పాడు ట్యూన్ ఉన్నాడు .
నాకు మాత్రం అసలు నచ్చలేదు.
ఎందుకో తెలిదు కాని నాకు రజిని కాంత్ అంతగా నచ్చడు . సరే పాటలు ఎ.ఆర్. రహమాన్ చేశాడు కదా అని పెట్టాను.
ఒక్క పాటైనా అర్దమైతే చెప్పుతో కొట్టండి
ఇలా రాయ వచ్చో లేదో నాకు తెలిదు , కాని నాకు మాత్రం చాలా చాలా కోపం వచ్చింది.
అసలు ఒక్క ముక్క కూడా అర్ధం కాకుండా ఆ పాటలు పాడటమెందుకో నాకు తెలియట్లేదు,
అంతలా పాట పెట్టలనుకొంటే ఆ లిరిక్స్ ని తీసివేసి కేవలం సంగీతాన్ని మాత్రమే ఉంచవచ్చు కదా , అలా మాటలు అర్ధం కాకుండా పాడటం ఏవిటో ...
అసలది ఇంగ్లీష్ పాటో తెలుగు/ తమిళ్ పాటో తెలీకుండా ఉంది .
ఎలా ఈ మద్య చాలా వస్తున్నై హ్మ్
తెలుగు పాట అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది :(
పాతమద్యలో ఏవేవో ఇంగ్లీష్ పదాలు అవికూడా ఏమైనా అర్ధమవుతాయ అంటే అది లేదు
అంట ఎదిగా ఉంటే ఆ భాషలోనే పాదిన్చావచ్చు కదా
ఎవరు కాదన్నారు , తెలుగు/తమిళ్/హిందీ పాట అని ఆ భాషనేందుకు భ్రష్టు పట్టించటం
ఈ దేశంలో చాలా మంది ఎ.ఆర్. రహమాన్ అభిమానులు ఉండొచ్చు నేనూ ఒకప్పుడు ఆయన అభిమానినే కానీ ఇప్పుడు అతని సంగీతం అంత అనిపించట్లేదు సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందులోని మాటలకి కవి వ్యక్త పరచే మాటలకి ప్రాదాన్యత లేదు :( అదే నాకు చాలా బాధగా ఉంది.
అదే పాత పాటలు వినండి , అప్పుడు కూడా చాలా రకాల వాయిద్యాలు వాయించే వాళ్ళు చాలా ప్రయోగాలు చేసే వాళ్ళు
కానీ ఎంత హాయిగా ఉంటుంది ,మాట ఎంత స్పష్టంగా వినిపిస్తుంది .
అదే ఉప్పుడు కోల్పోతున్నాం అని పిస్తుంది :(
ఇకనైనా మన సినిమా పాటలు విన సొంపుగా వస్తాయని ఆశిస్తున్నాను .