గ్రామీణ భారతం

10:33 PM Posted In Edit This 8 Comments »


అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఈ దృశ్యాలు ఇప్పటి గ్రామాల్లో చూడలేమనుకుంటా :(
అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఈశ్వరవాక
నేను చిన్నదానిగాఉన్నపుడు వేసవి సెలవలకి ఆ ఊరు వెళ్ళేవాళ్ళం
నాకు ఉదయం నుంచి రాత్రి 8 వరకు ఆ ఊరులోనే ఉండాలనిపించేది ఆ తర్వతకదా అమ్మగుర్తుకువచేది ఇక అదిమొదలు తెల్లవారుజామువరకు ఏడుపు :)
కానీ అవ్వ మాత్రం వంట చాలా బాగా చేస్తుంది , అమ్మ కూడా అవ్వదగ్గరే వంట , ఇంటి పనులు ,ఇల్లు అలకడం లాంటి పనులన్నీ చేయడం నేర్చుకుందట ఆ మాట చెప్పి నన్ను పని నేర్చుకోమని చంపేసేది
ఏ పనిచేప్పినా చేసేదాన్ని కాదు గానీ మజ్జిగచిలకడం మాత్రం ఎప్పుడూ చెబుతుందా అన్నట్లు చూసేదాన్ని
ఎందుకంటే ఈ బొమ్మలో ఉందే అలాటి గొల్లభామ కవ్వం ఉండేది , దాంతో మజ్జిగ చిలకడమంటే నాకు మహా సరదా అంతేకాదు దాన్లో వెన్న చాలా త్వరగా చాలా ఎక్కువ వస్తుంది చిలికినట్టి చిలికి మొత్తం తినేసేదాన్ని అడిగితే నేను కాదు
నేను చిలికి గిన్నెలో వేసి ఆడుకోడానికి వెళ్ళాను ఈలోపల పిల్లివచ్చి తినేసింది అని చెప్పేదాన్ని
అప్పుదందరూ నవ్వి ఆ తెల్లపిల్లి కదా... రెండు కాళ్ళుంటాయ్ , రెండు పిలకలుంటయ్ అదేనా అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు
వలింట్లో ఉయ్యాలబల్ల కూడా ఉండేది దానిమీద కూర్చోవటానికి ఉన్న ఆరుమండివి పోటీపడేవాళ్ళం
అయినా ఆరోజులే వేరు
మళ్ళీ ఆ రోజులు రమ్మన్నా రావు
మనకి పెళ్ళికాకముందు ఎలా ఆ రోజులు అంతగా గుర్తురావు ఎక్కుడైతే పెళ్లి చేసుకొని ఇంటికి ఊరికి దూరం అవుతామో అప్పుడు తెలుస్తుంది ఆ బాధ :( ఏవిటో హ్మ్
ఇంతకీ అడగడం మరిచా ఈ బొమ్మ ఇలా ఉంది ?? నే వేశా :)

INCEPTION

5:47 PM Edit This 2 Comments »
మొన్న శనివారం ఈ సినిమాకి వెళ్ళాం .
మొదటంతా అసలుఅర్దంకాలే,ఏవిటో ,ఈ కలలేవిటో,ఆ కలలోంచి ఇంకో కలలోకి వెళ్ళటాలేవిటో అబ్బబ్బ ... నాకుతెలిసీ నా జీవితంలో సినిమా హాల్ లో నిద్రతెప్పించిన సినిమా ఇదే.
ఇదిగో ఈ మెట్లు

చూసినప్పుడు ఇదేదో చాలా బాగుందని కొంచం మనసు పెట్టి చూసా . కొంచం అర్దమయ్యి కానట్టు అనిపిచింది .మా వారు మాత్రం చాలా లీనమైపోయి చూస్తున్నారు. నాకా తెలుగు సినిమాలు చుట్టం అలవాటై ఈ ఇంగ్లీషు సినిమాలల్లో ఒక్క మాట అర్దం కాకపోయినా మనసు నిలవదు, దాని అర్దం ఎవిటో మా వారిని చెప్పేదాకా తినేస్తాను.కానీ ఈ సినిమాలో అలా అదిగితే కొట్టేస్తారేమో అన్నట్టు చూస్తన్నారు...:)
అయినా ఏదో అర్ధమయ్యి ,కానట్టు చూసానులెండి
కానీ ఈ ఊహ చాలా బాగుందనిపిస్తుంది . మనిషి నిజ జీవితంలో చేయటానికి, చూట్టానికి అలవికానివి కలల ద్వారా సాధించవచ్చు అని అనిపించింది .
కానీ ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయ్........:)

మా బుజ్జి బొజ్జ గణపయ్య

3:44 PM Posted In Edit This 1 Comment »
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||
రాబోయే వినాయక చతుర్ధికి తయారైన మా బుజ్జి బొజ్జ గణపయ్య
పోయిన ఏడాది చివరి నిమిషంలో వినాయకుని పటం కోసం చాలా కంగారుపడ్డాం. విగ్రహం కొన్నాం కానీ పటం కొనడం మరిచాం. చివరి నిమిషంలో ఒక చిన్న వినాయకుని ఫోటోని ప్రింట్ తీసుకొని దాన్ని పెట్టి పూజ చేసేశాం. అందుకే ఈ సారి కొంచం త్వరగా నేనే నాకు తెలిసిన acylic paints తో ఈ బుజ్జి జేజాని పైంట్ చేశా
ఈ విఘ్ననాధుడే ఈ ఏడాది మా ఇంట కొలువుతీరబోతున్నారు

గుండ్రాయి బొమ్మలు

4:18 PM Posted In Edit This 9 Comments »
నేను డిగ్రీ చదివేప్పుడు అమ్మ,నాన్న డక్కిలి లో ఉండేవాళ్ళు ,అక్కడ ఈ గుండ్రాయిలని ఎక్కువగా అన్ని రకాలలో మొదటిసారి చూట్టం. ఎందుకోతెలిదు సముద్రానికి వెళ్ళినప్పుడు గవ్వలు ఎలా ఏరుకుంటామో అలా బోలెడు రాయిలు ఏరుకుని ఇంటికి తెచ్చను .
అంతకి ముందువారమే ఈనాడు వసుంధరా పేపరులో ఇలాంటి రాళ్ళతో తాబేలు బొమ్మని చేయటం ఎలానో రాసారని అమ్మ చెప్పింది.చూసాను ,కానీ నాకు మాత్రం ఎందుకో వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి చూడగానే లావుగా ఉన్న మనిషి కూర్చున్నట్టు అనిపించింది. :)
అప్పుడు వాటిని ఫెవికాల్తో అంటించి ఇలా చేసా ...

అవి అలా అంటుకోగానే చాలా సంతోషంగా అనిపించింది. ఇక వాటికి రంగులు వేసి ఇదిగో ఇలా తయారు చేసాను.


కొంపతీసి
ఇవి అవనుకునేరు.
ఇవి అవి కావు, అలానే ఉండే మరో జత .
అవి వాకాడులో మా అమ్మా దగ్గరున్నాయి .
ఇవి మొన్న సియాటెల్ సముద్రతీరానికి వెళ్ళినప్పుడు, అప్పుడుచూశానే.. అలాంటి గుండ్రాయిలే కనిపించాయి ,వాటితో చేశా .
ఇక మీకు చూపించకుండా ఉండటానికి మనసొప్పక ఇదిగో ...వీటిని బ్లాగులో పెట్టే .



ఎలాఉన్నాయి ....?
ఆనంద మానంద మాయనే ...మా తాతయ్యపెళ్ళికొడుకాయనే... మా అమ్మ్మమ్మ పెళ్ళికూతురాయనే

షష్ఠిపూర్తి మహోత్సవం

10:19 PM Posted In , Edit This 1 Comment »

మా ఇంట నేడు షష్ఠిపూర్తి మహోత్సవం తామెల్లరూ విచ్చెసి కార్యక్రమాన్ని జయప్రదం చేయ ప్రార్ధన

కార్యనిర్వాహకులు ,
స్రవంతి రవి


చిట్టి చిట్కాలు

4:56 PM Posted In Edit This 0 Comments »

తులసి మాత

10:50 PM Posted In Edit This 2 Comments »

శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే ..||2||
సతతము నిను సేవింతుము సత్కృపకనవే
సత్కృపకనవే .....||2|| ||శ్రీతులసి||
లక్ష్మీ పార్వతి వాణీ అంశలవెలసీ||2||
భక్తజనుల పాలించే మహిమనలరుచూ||శ్రీతులసి||
వొల్లగ శాఖలు వేసీ.... వెల్లుగ దళముల విరిసీ
శుభకర పరిమళములతో మా పెరటివేల్పువై వెలసీ...||శ్రీతులసి||
దళమునకొక విష్ణువుగా విష్ణుతులసివే...శ్రీకృష్ణ తులసివే...
జయహారతిగైకొనవే మంగళ శోభావతివై||శ్రీతులసి||

కవ్వపు పాట

9:45 PM Posted In Edit This 4 Comments »
ఈ పాట నేను ఒకటో తరగతి చదివేటప్పుడు మా తెలుగు వాచకంలో ఉండేది ..
ఈ పాటని ఎక్కువగా మా అమ్మ మజ్జిగ చిలికేటప్పుడు పాడేదానట అమ్మ చెప్పేది ....:)

మీకు తెలుసా...?

10:43 AM Posted In Edit This 0 Comments »
పిల్లలూ నిన్న మనం బొగ్గు పులుసు వాయువు గాలిలో ఎక్కువైతే కలిగే ప్రమాదాల గురించి తెలుసుకొన్నాం.

ఇవాళ దాన్ని ఏఏ పదార్ధ్హాల తయారీలల్లో ఉపయోగిస్తారో దాని లక్షణాలేమిటో తెలుసుకొందాం.
ఈ వాయువు గాలికంటే బరువైనది.
పుల్లటి వాసన కలిగి ఉంటుంది.
దీనిని మంటలు ఆర్పడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
దీనినే కార్బన్ డై ఆక్సైడ్ అని కూడా అంటారు .దీనిని సోడా అదే మీరు తాగుతారే కూల్ డ్రింక్స్ వాటి తయారీలో కూడా ఉపయోగిస్తారు.

ఇప్పుడు మనం సోడా ఎలా తయారుచేస్తారో తెలుసుకొందాం.

ఒక సీసాలో నీళ్ళు లేదా ఏదైనా సుగంధపు నీటిని తీసుకొని అందులోకి ఎక్కువ మొత్తంలో ఈ బొగ్గుపులుసు వాయువుని పంపి వెంటనే మూత బిగించి సీలు చేసేస్తారు.
H2O+CO2->H2CO3
అంటే నీటిలో అధిక మొత్తంలో ఈ వాయువుని కరిగించి అతిసంతృప్త ద్రావణంగా చేసి సీలువేస్తారన్నమాట ...
పిల్లలూ ఎప్పుడర్ధ్హమైదా...మీరు తాగే ఈ కూల్ డ్రింక్స్ లో ఏ వాయువుందో ..?ఆ .....
బొగ్గుపులుసు వాయువు ఉంది. నిన్న మనం ఏమని చెప్పుకొన్నాం.?
బొగ్గుపులుసు వాయువు చాలా ప్రమాద కరమైనది అని కదా ...!
మరి అలాంటీ ప్రమాదకరమైన వాటిని మీరు ఇప్పటి వరకూ తాగుతున్నారు . కాబట్టి ఇకనుంచి వాటిని తాగటం మానివేయండి .
సరేనా........!
వాటిబదులుగా కొబ్బరినీళ్ళు ,పండ్ల రసాలు తాగండి .అవి ఆరోగ్యానికి చాలా మంచివి .
పిల్లలూ "ఆరోగ్యమే మహాబాగ్యం, ఐకమత్యమే మహాబలం" . దీనిని మీరెప్పుడూ మరవకండి.
.......సశేషం

మీకు తెలుసా.........?

4:39 PM Posted In Edit This 1 Comment »
పిల్లలూ మీ చుట్టూ ఉండే ఈ గాలిలో ఏ ఏ వాయువులు ఉన్నాయో మీకు తెలుసా...?

ఇప్పుడు మనం ఆ వాయువులనీ, వాటి లక్షణాలనీ ప్రయోగ పూర్వకంగా తెలుసుందాం.
మన చుట్టూ ఉండే ఈ గాలిలో అనేక రకాల వాయువులు ఉన్నాయి . గాలిలో 78.08% నత్రజని , 20.95% ఆమ్లజని, 0.93% ఆర్గాన్, 0.038% బొగ్గుపులుసు వాయువు ,దరిదాపు 1% నీటి ఆవిరి ,అతి తక్కువ శాతం ఇతర వాయువులు ఉన్నాయి.
వీటిలో చాలా చాలా ముఖ్యమైనది ఆక్సిజన్ .దీనినే ప్రాణ వాయువు అనికూడా అంటారు. మనమూ, మన చుట్టూ ఉండే ఈ జంతువులు, పక్షులు, చేపలు ...ఇంకా ఈ ప్రాణులన్నీ ఈ ప్రాణ వాయువువల్లే జీవిస్తున్నాయు.అందుకే ఇది అతి ముఖ్యమైనది . గాలిలో ఈ ఆక్సిజన్ తగిన శాతంలో లేకపోతే ఈ ప్రాణులన్నీ చనిపోతాయి . కావున ఈ వాయువుని వీలైనంత ఎక్కువ మొతాదులో గాలిలో ఉందెలా చూడాలి .దీనికోసం మనం చెట్లని ఎక్కువగా పెంచాలి. ఎందుకంటే మనం అంటే నువ్వూ ,నేనూ ,ఇంకా ఈ జంతువులు అన్నీ ఈ ఆక్సిజన్ ను పిల్చుకొని ,బొగ్గు పులుసు వాయువుని వదులుతున్నాయి. కానీ చెట్లు, మొక్కలు మాత్రం ఈ బొగ్గు పులుసు వాయువుని పీల్చుకొని ప్రాణ వాయువుని వదులు తున్నాయి . అంటే మనం వదిలే వయువుని చెట్లు పీల్చుకొని మనం పీల్చే వాయువుని విడుదల చేస్తున్నాయన్నమాట..
గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరగడాన్ని "హరిత గృహ ప్రభావం" అంటారు.
ఈ హరిత గృహ ప్రభావం చాలా ప్రమాదకరమైనది . దీనిని తగ్గించడానికి మనం ఎమి చెయ్యాలి..?
ఆఆ ...చెట్లని ఎక్కువగ పెంచాలి .
మరి మీరుకూడా చెట్లను తప్పక పెంచుతారుకదూ..
...సశేషం

రాధా కృష్ణులు

8:07 PM Posted In Edit This 5 Comments »
రాధకు నీవేర ప్రాణం ఈ రాధకు నీవేర ప్రాణం ....

గొబ్బిళ్ళు

1:27 PM Posted In Edit This 5 Comments »
పల్లవి : కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదుకులాస్వామికిని గొబ్బిళ్ళో ||3||
యదుకులాస్వామికిని గొబ్బిళ్ళో ||2||
చరణం : 1 కొండగొడుగుగా గోవులకాచిన పొందుక శిశువుకు గొబ్బిళ్ళో ||
దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో || ||కొలని||
2 పాప విధున శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో ||
ఏపున కంసుని ఇడుమనపెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళో || ||కొలని||
3 గండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో ||
వెండిపైడియగు వేంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో || ||కొలని||

బావా-మరదళ్ళు

11:29 AM Posted In Edit This 5 Comments »

సొగసు చూడ తరమా

4:34 PM Posted In Edit This 3 Comments »
సొగసు చూడ తరమా నీ ...........సొగసు చూడ తరమా ...ఆ .....
ఇంతటి అందాన్ని బాపు గారు వేసిన దాన్ని చూసి మనసులో ఏదో తెలియని ఆవేశంతో
ఈ కాగితంపై ఉంచాను .

మంగళం

4:40 PM Edit This 2 Comments »
రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకా భీష్టదాయ మహిత మంగళం
చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం
రామదాస మృదుల హృదయ తామరస నివాసనాయ
స్వామి భద్ర గిరివరాయ దివ్య మంగళం

గుత్తి వంకాయకూర

2:42 PM Posted In Edit This 2 Comments »

మంగళవార పూజాఫలం

2:09 PM Posted In Edit This 4 Comments »

శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం
త్రిశక్తి రూపిణీం అంభాం దుర్గాం చంఢీం నమామ్యహం

నేను ప్రస్తుతం ఇంత సుఖంగా, సంతోషంగా ఉన్నానంటే ఆ అమ్మ కృపే...
ఒక ఆడపిల్లకి చదువు, అందం , ఉద్యోగం ఉన్నా మంచి భర్తా,మంచి అత్తమామలు,కలగటమే అదృష్టంగా భావిస్తాను .
నాకు అటువంటి అదృష్టం కలుగజేసింది ఆ అమ్మ .
నాన్న పోయాక ఒక సంవత్సరానికి నా చదువు పూర్తైయింది. ఇక ఉద్యోగప్రయత్నాలు యస్ .బి.ఐ. క్లర్కు
పోస్టుకి ప్రెపేరయ్యాను ,కానీ నాకు రాలేదు. ఎలాంటి సమయంలో నాకొక పెళ్ళిసంభందం వచ్చింది . అమ్మకీ, అన్నయ్యకీ, తాతయ్యకీ చాలా బాగానచ్చింది. నాకుకూడా మావారు నచ్చారు .నిజం చెప్పాలంటే అదిచాలా పెద్ద సంభందం .అమ్మ చాలా భయపడింది, కట్నం అడుగుతారేమోనని . కానీ ముందు జాతకాలు చూడాలి కదా ..నాకు అప్పటివరకూ జాతకం వ్రాయలేదు ,కేవలం పుట్టీనతారీకు ,టైము తెలుసు. సరే జాతకం రాయించటానికి మా మేనమామ ,తాత వెళ్ళారు. నా జాతకం చూసినాయాన నాకు 2009కానీ, 2011లో కానీ కళ్యాణం జరుగుతుందనిచెప్పారు కానీ నాకు అప్పుడు రాహువు సరిగాలేదని , నన్ను 22 మంగళవారాలు రాహుకాలంలో ఉపవాసంతో నిమ్మకాయ దీపాలు వెలిగించి, బెల్లం నైవేధ్యంగా పెట్టమన్నారు .
అలానే నేను ఐదోవారం పూజచేసి లేవగానే పెళ్ళివారినుంచి ఫోను అమ్మాయి మాకు నచ్చింది కట్నం కూడా వద్దూఅని...
తరువాత ఒక 2 గంటలకి మా అన్న ఫోను చేసి వాడికి యన్.టి.పి.సి. లో ఉద్యోగంవచ్చిందని చెప్పాడు. అంతే మా ఆనందానికి అవధులు లేవు .
నాకు, అమ్మకీ ఇదంతా ఆ అమ్మ కృపేనని అనిపించింది . ఆ అమ్మ ఐదువారాలకే అంతటి దయ చూపింది మాపైన .
ఎలా 22 వారాలు పూర్తి కాగానే మార్చి 12, 2009 లో నాకు మా వారితో వివాహం అయ్యింది . మా అత్తగారు కూడా ఈ పూజ 6 సంవత్సరాలనుండి చెస్తున్నారట. ఆ తల్లినీ, ఆమెచూపిన కృపనూ ఏరోజూ మరువను .
మీరు కూడా ఈ పూజ చేసి ఆ తల్లి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను ....


మిరపకాయ బజ్జీలు

5:10 PM Posted In Edit This 7 Comments »
ఐదుగంటల వేళ ఆదారి ప్రక్కగా చుయ్..మనునూ,గూబ ఘూయ్....మనునూ.......
పచ్చిమిరపకాయ కచ్చి రేపెడునట్లు గుచ్చి చూ...చుచునుండు గుండెవైపు.................
శెనగ కవచమూలె సలసలా వెగుచూ కడుపులో రసనాడి కదులసాగు
ముక్కకొరికినంత ముల్లుకములయాత్ర చేత పైసాలేక చేయగలడు ........
ధనము వెచ్చించి కన్నీళ్ళు కొనగచేయు మిరపబజ్జీల రుచిని నే మరువలేను
ఒక్కటో ..రెండో మంచిదే.....ఎక్కువైన సచిను టెండూల్కరుడు మాకు సాటిరాడు.............

కీరదోస పప్పు

4:42 PM Posted In Edit This 0 Comments »

చిట్టి చిట్కాలు

3:45 PM Edit This 2 Comments »