బుడ్డిలాట
1:32 PM Posted In జ్ఞాపకాల పందిరి Edit This 2 Comments »నిన్న ఉదయం ఇల్లు సర్దుతుంటే ర్యాకు అడుగున నా చిన్నప్పటి ఆల్బం కనిపించింది .
దాన్ని చూడగానే నా మనసుకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఇక ఇల్లు సర్దడం మానేసి ఆ ఆల్బం చూస్తూ కూర్చున్నాను. మొదటి పేజీ తిప్పగానే నేను మా మావయ్య కూతురు చిన్నప్పుడు బుడ్డిలాట ఆడుకొనే ఫోటో కనిపించింది .
నాకు ఊహ తెలిసి తెలియక ముందు నుంచి దరిదాపు ఎనిమిదో తరగతి వరకు ఈ ఆట ఆడేదన్ని ఈ ఆటంటే నాకు చాలా ఇష్టం ...అప్పట్లో అమ్మ స్కూల్ కి వెల్లమంటే కూడ వెల్లెదాన్ని కాదు అమ్మమ్మ కూడ అమ్మతో అదేమన్నా ఐ.ఎ.యస్ ,ఐ.పి.యస్, చదువుతుంద ఏంటీ.. అని నాకు సపొర్టు...
ఇలా రోజూ జరిగేది.. మేము ఎక్కువ అమ్మ- పాప ఆట, టీచర్ ఆట ఆడుకొనేవాళ్ళం . దానికంటే నేను పెద్ద కాబట్టి నేను అమ్మ అది పాప,ఈ ఫొటోలో కూడా చూడండి ఇద్దరం ఎలా ఆడుకుంటున్నామొ....
మా ఊళ్ళో కనుపూరి జాతర జరుగుతుంది .అక్కడ చాల బొమ్మలు అమ్ముతారు .ఒకసారి అమ్మని అడిగి ఎడ్చి మరీ స్టీలుబుడ్డిలు కొనిపించుకున్నాను. ఆ తర్వాత ఆదివారం నేను,మా అన్న,పక్కింటి విజయ లక్ష్మి ,పవన్ అందరం కలిసి ఈ స్టీలు బుడ్డిలతో నిజం వంట చేయాలనుకున్నాం .
కాని మా దగ్గర పప్పు ,ఉప్పు,చింతపండు, లేవు కదా...అమ్మనడిగితే కొదుతుందని భయం ఇక వుందిగా... అమ్మమ్మగారిల్లు తాతయ్య కంట పడకుండా ఎలానో గుడి వెనక వంట చేశాం. చాలా బాగా వచ్చింది...
ఇలా సరదాగా మొదలైంది నా వంట..
పెళ్ళికి ముందు కూడా ఎప్పుడైన వండేదాన్ని, కానీ పెళ్ళి తర్వాత వంటే పనిగా... వంటిల్లే వైకుంఠంగా... మారిపోయింది . కానీ...అదే చాలా బాగుంది . అందరికీ ఇలా నాచేత్తో వందిపెడుతుంటే చాలా తృప్తిగా ఉంది. ఇలా చాలా మంది ఆడవాళ్ళకి అనిపిస్తుంది. కానీ.. ఇది పెళ్ళి తర్వాత నాకు కలిగిన మొదటి అనుభవం
2 comments:
nenu himaja
aa rojulu malli vasthey bagunnu aa atalu "vepaku sai vennamuda sai" antu egaradam soo funnyyyy
naku mana buddilata photo antey chala ishtam ......
:):) మధుర జ్ఞాపకాలు....కాలచక్రం గిర్రున తిరుగుతునె ఉంటుంది....వెనక్కి వెళ్ళాల్సినవి వెళ్తునే ఉంటే వచ్చెవి వస్తూనే ఉంటాయి...అదీ కధ
కామెంట్‌ను పోస్ట్ చేయండి