లావు తగ్గాలనుకున్తున్నారా.......?

11:33 AM Posted In Edit This 11 Comments »
అయితే ఎలా చెయ్యండి
రోజూ ఉదయం స్నానానికి వెళ్ళేదానికి అరగంట ముందు ఆవ నూనె (mustard oil) , కర్పూరం నీ కలిపి వేడి చేసి మీ శరీరానికి మర్దనా చేయండి.
ఇలా ఒక నలబై రోజుల పాటు రోజూ చేస్తే మీ బరువు తప్పక తగ్గు తుంది.
గమనిక: ఒక కప్పు నూనెకి, నాలుగు కర్పూరపు బిళ్ళలు వేస్తే చాలు.
ఆవనూనె శరీరనికి చాలా మంచిది. దీనిని రాసుకున్న కొద్ది సేపటికే చమట రూపంలో మన శరీరంలో ఉండే కొవ్వు బయటకి వస్తుంది.
ఇది శరీరాన్ని పొడిబారకుండా చేస్తుంది. అంతేకాదు ఆయిల్ మసాజ్ వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
కొన్ని ప్రాంతాలలో దీనిని వంట నూనెగా కూడా వాడుతారు.

శిరోజాల సంరక్షణ కొరకు:
ఈ ఆవ నూనెలో గోరింటాకుని వేసి కాచి తలకు మర్దనా చేస్తే మీ వెంట్రుకలు ఎంతో అందంగా, వత్తుగా పెరుగుతాయి.జుట్టు రాలటాన్ని కూడా నివారిస్తుంది.
ఇది నేను అనుభవం మీద చెబుతున్నాను. దీని వల్ల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు
మీరు తప్పక ప్రయత్నించి మంచి ఫలితం పొందుతారని ఆశిస్తున్నాను.

పాడుతా తీయ్యగా

12:30 PM Posted In Edit This 3 Comments »
ఆ పేరు వినగానే మనందరికీ గుర్తోచ్చేపేరు బాలుగారు ఇంకా
పపప..మమమ..రిరిరి..రిసమరి
పపప..మమమ..రిరిరి..సరిరిస
స్వరాలపనే సరాగాలుగా
శృతీ లయలలో జగాలూగగా
సుధానాదమే యదేమీటగా
రసానందమే అలై పొంగగా
ప్రాణాలు పులకించగా అ అ అ ...
మౌనాలు రవళించగా
ఇవే కదా మనందరికీ గుర్తొచ్చేవి :)
కానీ ఈ మద్య చాలా మంది దగ్గర వింటున్నాను , ఇప్పుడు వచ్చే పాడుతా తీయ్యగా అంత బాగు లేదు అని
కానీ నేను దానితో ఏకీభావించను.
ఎందుకంటే ఇప్పుడు అన్ని చానల్స్ లో ఈ పాటల సందడి పెరిగి పోయింది .
కానీ ఇలాంటివి ఎన్ని చేసినా దీని ముందు దిగదుడుపే.
దాని స్థానం ఎప్పుడూ అక్కడుంటుంది, దానిని చేరటం సాధ్యపడే విషయం కాదు.
ఎందుకంటే దీనిలో వెకిలి వేషాలు, వెకిలి చేష్టలు ఉండవ్ . ఎన్నో మంచి విషయాలే కాక తెలుగుని తెలుగులా ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని గ్రహించవచ్చు. పిల్లలు కూడా ఎంతో పద్దతిగా ఉంటారు (ఆ ప్రోగ్రాం లో ).
మిగిలిన ఏ ఛానల్ లో ఇన్నిమంచి విషయాలు చూడ గలమా చెప్పండి.
ఇది ఒక పక్కన ఉంచితే
పిల్లలు కొంచం బాగా పడితే చాలు ఆహా ..వోహో..అంటూ వాళ్ళని అందలానికేత్తేయ్యడం . ఇది ఒక విధమైతే ,
పిల్లలు కొంచం తప్పు పాడినా వాళ్ళు అక్కడే ఏడ్చేలాతిట్టటం. అంతటితో ఆగదండోయ్ వాళ్ళు ఏడ్చేటప్పుడు వెనక నుంచి మ్యూజిక్
హ్మ్..ఏవిటో.
ఇలాంటి దృశ్యాలు పాడుతా తీయ్యగాలో చూడగలమా?
ముఖ్యంగా అవతలి మనిషిని గౌరవించాలి , ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి , ఎలా మందలించాలి అనేవి ఆ వ్యక్తినుంచి మనం తప్పక అలవరుచుకోవలసిన విషయాలు.
ఇవన్నీ అందరూ ఒప్పుకుంటారని నాకు తెలుసు :)
కానీ నన్ను చాలా మంది అడిగింది న్యాయనిర్ణేతల గురించి
ఆ విషయానికొస్తే ఒక్క యన్.టి.ఆర్ అభిమానులైనా ఇద్దరు, ముగ్గురు వారిని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఏవిషయంలో తక్కువ. వెంకటేష్ అంటారా.. అతను కూడా చాలా మంచి చిత్రాలే కదా తీశాడు, ఎ వయసు తక్కువనుకున్తున్నారా ? :)
వాళ్ళ అన్న సురేష్ బాబుని అంటారా.. అతను కూడా ఒక గొప్ప పేరు గల సమస్థకు యజమానే కదా.
బాపు గారు , రమణ గారు , రాజన్ నాగేంద్ర గారు, పి.బి. శ్రీనివాస్ గారు, ఇలా ఎంతోమంది గొప్ప వ్యక్తులని మనం కేవలం ఈ పాడుతా తీయ్యగాలోనే చూడగలం
ఏది ఏమైనా పాడుతా తీయ్యగా ద్వారా మనకు ఇంత మంచి సంగీతాన్ని అందిస్తున్నబాలు గారికి శిరస్సు
వంచి పాదాభివందనం చెయ్యాలి
సర్వే జనా సుఖినో భవంతు
సర్వే సుజనా సుఖినో భవంతు

రోబో

10:27 PM Posted In Edit This 6 Comments »
నేను నిన్న మా అన్న పంపిన రోబో సినిమా పాటలు విన్నాను
వాడికి మాత్రం తెగ నచ్చినట్లున్నాయి . అందుకనే ఎక్కడ చూసినా ఓ యంత్రికుడా..అని ఏదో ఏదో పాడు ట్యూన్ ఉన్నాడు .
నాకు మాత్రం అసలు నచ్చలేదు.
ఎందుకో తెలిదు కాని నాకు రజిని కాంత్ అంతగా నచ్చడు . సరే పాటలు ఎ.ఆర్. రహమాన్ చేశాడు కదా అని పెట్టాను.
ఒక్క పాటైనా అర్దమైతే చెప్పుతో కొట్టండి
ఇలా రాయ వచ్చో లేదో నాకు తెలిదు , కాని నాకు మాత్రం చాలా చాలా కోపం వచ్చింది.
అసలు ఒక్క ముక్క కూడా అర్ధం కాకుండా ఆ పాటలు పాడటమెందుకో నాకు తెలియట్లేదు,
అంతలా పాట పెట్టలనుకొంటే ఆ లిరిక్స్ ని తీసివేసి కేవలం సంగీతాన్ని మాత్రమే ఉంచవచ్చు కదా , అలా మాటలు అర్ధం కాకుండా పాడటం ఏవిటో ...
అసలది ఇంగ్లీష్ పాటో తెలుగు/ తమిళ్ పాటో తెలీకుండా ఉంది .
ఎలా ఈ మద్య చాలా వస్తున్నై హ్మ్
తెలుగు పాట అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది :(
పాతమద్యలో ఏవేవో ఇంగ్లీష్ పదాలు అవికూడా ఏమైనా అర్ధమవుతాయ అంటే అది లేదు
అంట ఎదిగా ఉంటే ఆ భాషలోనే పాదిన్చావచ్చు కదా
ఎవరు కాదన్నారు , తెలుగు/తమిళ్/హిందీ పాట అని ఆ భాషనేందుకు భ్రష్టు పట్టించటం
ఈ దేశంలో చాలా మంది ఎ.ఆర్. రహమాన్ అభిమానులు ఉండొచ్చు నేనూ ఒకప్పుడు ఆయన అభిమానినే కానీ ఇప్పుడు అతని సంగీతం అంత అనిపించట్లేదు సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందులోని మాటలకి కవి వ్యక్త పరచే మాటలకి ప్రాదాన్యత లేదు :( అదే నాకు చాలా బాధగా ఉంది.
అదే పాత పాటలు వినండి , అప్పుడు కూడా చాలా రకాల వాయిద్యాలు వాయించే వాళ్ళు చాలా ప్రయోగాలు చేసే వాళ్ళు
కానీ ఎంత హాయిగా ఉంటుంది ,మాట ఎంత స్పష్టంగా వినిపిస్తుంది .
అదే ఉప్పుడు కోల్పోతున్నాం అని పిస్తుంది :(
ఇకనైనా మన సినిమా పాటలు విన సొంపుగా వస్తాయని ఆశిస్తున్నాను .

వినాయక గోడుగులుమా ఒకటే వకటి రెండే రూపాయలు ....

9:10 PM Posted In Edit This 7 Comments »

రండమ్మ రండి , మీ వినాయకుడికి గొడుగు కావాలా ఐతే ఇదిగోండి ....
ఒకటి రెండు రూపాయలు , రెండు మూడురూపయలే
ఆలసించిన ఆశాభంగం రండి త్వరపడండి :)
హహ...హహ...హ .....
ఏమి చేసేదండి మా వారు గొడుగు తేలేదు గొడుగు లేకుండా ఉండకూడదని నేనే చేశా
దీన్ని చూసి దీనికంటే ఏమీ పెట్టకుండా ఉంటేనే బాగుండేదని చెప్తున్నారు. కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఏవంటారు ....?
మా వారన్నారు నువ్వెవరిదగ్గరైన దీన్ని భాగుంది అని చెప్పించు చూద్దాం అని చాలంజ్ చేసారు
అందుకే అంగడి కూడా పెట్టేసా
మీ అందారికి నచ్చింది కదా అయితే తప్పక నా దగ్గర కోనాలండోయ్
అప్పుడే కదా నేను చేసింది అట్లాంటి ఇట్లాంటి గొడుగు కాదని వారికి తెలిసేది
ఏవంటారు ..? :)
ఏమి చేసేదండి బాగులేదని నాకు మాత్రం తెలీదా..
అందరికీ ఫోన్లు చేసి మరి చెప్తున్నారు అందుకే ఇలా చేశా
అయ్యయో .. అలా చూసి వెళ్లి పొతే ఎలా గండి రండి కొనండి నన్ను గెలిపించండి
మీకు గాబట్టి ఇంత తక్కు వకి అమ్ముతున్నాను కావాలంటే ఒకటి కొంటె ఒకటి ఫ్రీ
కనీసం ఎప్పుడైనా తీసుకోండి ప్లీజ్
సరే కనీసం రూపయకి పది ఇస్తాను ఎప్పుడైనా తీసుకోండి ప్లీజ్
సరే సరే కనీసం ఫ్రీ గా ఇస్తాను ఎప్పుడైనా తీసుకోండి ప్లీజ్ అంది ప్లీజ్ తీసుకోండి :)

మనసు పలికింది మానస వీణ

3:27 PM Posted In Edit This 11 Comments »
మొన్న శనివారం నేను మా వారు కలిసి చిన్న విహారయాత్రకి వెళ్ళాం
ఈ దేశానికి వచ్చాక AMTRAK లో ఎక్కువ దూరం వెళ్ళటం ఇదే మొదటి సారి , చాలా బాగా ఎంజాయ్ చేసాం :)
సోమవారం తిరిగి వచ్చాం . తిరిగి వచ్చేప్పుడు ఒక చిన్న తమాషా జరిగింది అదేమిటంటే ...
నాకు పాటలు వినడమన్నా, పాడటమమన్నా చాలా ఇష్టం .ఏదో మోస్తరుగా పడుతాను లేండి:)
నేను ipod లో వింటూ నాకు తెలీకుండానే చాలా పెద్దగా పాడేసానట, ఈ సంఘటన తరచూ జరుగుతుంది లేండి కానీ మా ములుగా మావారు చిన్నగా..చిన్నగా..అని చెబుతుంటారు. కానీ నిన్న అలా ఏమి చెప్పలేదు నా పాటికి నేను రెండున్నర గంట పాడుకొంటునే ఉండిపోయాను :)
ఆ తర్వాత స్టేషన్ వచ్చేసింది దిగటానికని పైకి లేచాం
అప్పుడేమి జరిగిందో తెలుసా ..?
అబ్బో నాకు సిగ్గేస్తోంది :)
అప్పుడేమిజరిగిందంటే మా వెనక సీటులో కూర్చొని ఉన్న అమెరికన్ ఆవిడ నా చెయ్యి పట్టుకొని చాలా చాలా బాగా పడావు , నీ పాట వింటూ మేము ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేశాము అని చెప్పారు
అప్పుడు కొద్దిసేపు నా గొంతు మూగపోయింది .ఆవిడకి థాంక్స్ అని చెప్పనే కానీ ఆవిడ నిజంగానే బాగుందంటున్నారా ..లేక బరించలేక దాన్ని అలా చెప్పరా ..? అని అనుకుంటూ మా వారితో అన్నాను మాములుగా అయితే తమాషాగా నువ్వనుకోనేది నిజమే అని అనే వారు :)
కానీ నిన్న మాత్రం నిజంగా చాలా బాగా పాడావ్ అందుకనే నువ్వు పెద్దగా పాడుతున్న వింటూ వుండిపోయాను అని చెప్పారు . 'ఆహా' అని అనిపించింది. మళ్లీ కిందకి వచ్చాక కూడా ఆవిడ, ఆవిడ ఫ్రెండ్స్ కూడా మళ్లీ అలానే అన్నారు, అప్పుడు ఇక ఇది నిజనేననినమ్మే..:)
ఆ ఆనందంతో రెండు కేజీలు బరువు పెరిగి పోయా... అందుకే ఇవాళ నడక రాజుకంటే కొంచం ఎక్కువ చేశా లెండి :)
మనసున మల్లెల మాలలూగెనే ..కన్నుల వెన్నెల డోలలూగెనే...
ఎంత హాయి ఆ పగలు నిండెనో ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో..