ముగ్గులే ముగ్గులు మా మాంచి ముగ్గులు

7:12 PM Posted In , Edit This 1 Comment »
ఆ మద్య చెప్పాగదండి ముగ్గులు వేస్తున్నానని ఎప్పుడూ వేసే ముగ్గులేనా అని మార్పు కోసమని కొత్త ముగ్గుల కోసం వెతుకుతుండగా ఈ వెబ్సైటు కంటపడింది. వామ్మో ..! ఎన్ని ముగ్గులో కొన్ని మాములుగా ఉన్నా, ఇంకొన్ని మాత్రం చాలా చాలా బాగున్నాయి. కొన్నిటికి చుక్కలు రాసారు, కొన్నిటికి రాయలేదు. ఆ చుక్కలు రాయని ముగ్గులే నాకు ఎక్కువగా నచ్చేసాయి ఇక చెప్పేదేముంది వాటిని సొంతగా వేసేదానికి ప్రయత్నిస్తున్నాను. కొన్ని మాత్రం బాగానే వేసేశాను. కొన్ని మాత్రం రావట్లేదు :(
http://www.ikolam.com//
మీరూ ప్రయత్నించండి. చాలా బాగున్నాయి. బోలెడన్ని వెరైటీ ముగ్గులు మీ కోసం వేచిచూస్తున్నాయ్ :)
http://www.ikolam.com/node/17343?p=343

ఇది చూడండి, ఎంత బాగుందో..!
మరేమిటి ప్రయత్నిస్తారా ..? :)

మా పసలపూడి కథలు

6:17 PM Posted In Edit This 4 Comments »

ఈఅడ్వటేజిమెంట్ చూడగానే చప్పలేనంత ఆనందం కలిగింది. ఎప్పుడు మొదలవుతుందా..?అని ఆశగా వేచి వున్నాను.
పాట కూడా చాలా చాలా బాగుంది. అందుకే మీరు కూడా విని ఆనందిస్తారని పెట్టాను.
మా పసలపూడి కథలండీ..
ఏ కథలు కన కథలండీ ..
మీ రుసరుసలు వదులండీ
మై మరపులిక మొదులండీ
మా బుల్లితెర మీ కళ్ళతెర నుంచున్న వేళ
ఆ త్మీయతలు ఆ వేదనలు చేస్తున్న లీల
చూడాలంట ఆడాలంట ఇంట్లోచేరి మీరంత మీవాళ్ళంత ..మీమనసులకే అవి జతలంటా...

పసల పూడి కథలు అనగానే నాకు ముందు గుర్తొచ్చేది డక్కిలి (వేంకటగిరి దగ్గర ) .నేను BSc చేసే రోజుల్లో మా అమ్మకి ఆ ఊరికి ట్రాన్ స్వర్ అయ్యింది. ఆ ఊరిలో మాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు, అదీకాక నేను అన్నయ్య వాకాడులో చదువుకొనే వాళ్ళం , అమ్మ నాన్న డక్కిలిలోఉండేవాళ్ళు . అందువల్ల సెలవలకు అక్కడికి వెళితే ఇంట్లోనే కూర్చోవాలి తప్పదు:(
అప్పుడు నా జీవితంలో మొదటిసారి గ్రంధాలయంకు వెళ్ళడం జరిగింది :)
వెళ్ళిన వెంటనే పెద్ద బుద్దిమంతులలాగా అక్కడ బయట పెట్టివున్న ఉద్యోగ సోపానం , విద్యా ..ఎలాంటివి తీసి చదువుతుండగా మూడు రోజులతర్వాత అక్కడి లైబ్రేరియన్ మనం పెద్ద మేధావులమనుకొని పాతసంచికలు కూడా చూడదండి ఇక్కడ ఉన్నాయి అన్నారు. మీరు ఏమిచేస్తున్నారు, BSc నా BA నా? ఏదైనా బుక్స్ అవసరమైతే నన్ను అడగండి అని ఎంతో వినయంగా చెప్పి వెళ్లారు. మనవు అంతేవినయంగా అలానే అని చెప్పి అలా పాత సంచికలు తిరగేస్తుండగా ఆపక్కనే స్వాతి పుస్తకం కనిపించింది. ఇక అలవాటు ప్రకారం ఈ ఉద్యోగ సోపానాన్ని పక్కనబెట్టి ఆ స్వాతి పుస్తకాన్ని అందుకొని చూస్తుండగా అక్కడ మన బాపుగారువేసిన బొమ్మలు కనిపించాయి ఏవిటా అని చదువుతుంటే
బాగా ఉండే అని గబగబా చదివేసి పాత స్వాతి పుస్తకాల వేటలో పడ్డాను. అలా మాములుగా 12 గంటలకి ఇంటికి వెళ్ళేదాన్ని ఆ రోజూ 2 అయ్యింది :)
ఇంటికి వేచ్చేసరికి అమ్మ ఏమి అన్నానికి కూడా రాకుండా ఎక్కడున్నావ్ అని అడిగితే ఆ పక్కనే ఉన్న లైబ్రరియన్ మాలైబ్రేరిలోనే ఉంది లెండి అని నవ్వుకుంటూ వెళ్లి పోయాడు :) అలా ఎందుకు నవ్వాడో అప్పుడు అమ్మకు తెలీలేదు
(మనకి తెలుసు కదా ) అలా రోజూ పసలపూదికతలు చదివి ఇంటికి రావడంతో పది రోజులు గడిచి పోయాయి. ఆ లైబ్రేరియన్ పసల పూడికతల మీద మనకున్న మక్కువ చూసి మీరు కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పాడు. ఆ మాట అనగానే తెలీకుండానే అప్రయత్నంగా అమ్మో ...స్వాతి పుస్తకం చదువుతున్నానని అమ్మకి తెలిస్తే చంపేస్తుంది అని అన్నాను. ఆయన నవ్వుతూ నువ్వు పసల పూడి కథలేగా చదువుతున్నావ్ దానికెందుకు అలా భయపడేది మేడంగారు ఏమి అనరులే తీసుకువెళ్ళు అని నవ్వుతూ వెళ్లి పోయారు.
అప్పటికే అక్కడ ఉన్న పాత సంచికలన్నీ చాలా వరకు చదివేసాను. సరే చెప్పారుకదా అని మిగిలిన పుస్తకాలని ఇంటికి తీసుకు వెళ్లాను అమ్మ వాకిట్లోనే చేతిలో ఆ పుస్తకాలు చూసి కొట్టేసేలా చూసింది. అదికాదు ఇందులో పసలపూదికతలు బాగున్నాయి అని ఆ లైబ్రేరియన్నే ఇచ్చాడు అని తడుముకోకుండా అబద్దం చెప్పి లోపాలకి వచ్చేసాను.
అమ్మకి కోపం తగ్గినతరువాట పక్కన కూర్చొని ఆ పసల పూడి కథలు పెద్దగా చదవడం మోదులేట్టా
అమ్మ విని నేను చదివేసిన వేరొక పుటకం తీసి తను కూడా చదవడం మోడులేట్టింది :)
ఎప్పుడూ అర్దమయ్యిందా నేను ఎందుకు తీసుకోచ్చుకున్ననో ..పెద్ద కొట్టేసేలా చూసావే అని నవ్వుకుంటూ అన్నాను
అమ్మ అంది - సర్లే బానే ఉంది ఇలాంటివి చదివితే పర్లే అని వెళ్లి పోయింది :)

ఈ పసల పూడి కథలు ఎవరు సీరియల్ గా తీస్తున్నారో తెలీదు కానీ బాపు గారు డైరెక్ట్ చేస్తే బావుంటుందని నా ఆశ మరి మీరేమంటారు..?

మహా బాగా సాగిపోతున్న ధనుర్మాసం

12:56 PM Posted In Edit This 0 Comments »
నాకు ఈ ధనుర్మాసం అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఈ మాసంలోనే పుట్టాను.
మొన్న 16వ తారీకు ధనుర్మాసం ఆరంభం రోజున నా పుట్టిన రోజు.
పుట్టిన రోజు పోయిన ఎడాది లానే అమ్మవాళ్ళు దగ్గర లేకుండానే జరిగిపోయింది. అదేలా ఉన్నా,
ఈ ఎడాది ఒక శుభవార్త.
పోయిన ఎడాది కేవలం కాగితంకు మాత్రమే పరిమితమైన నా అందమైన రంగవల్లులు నేడు నేలమీద ప్రత్యక్షం అవుతున్నాయి .
అవును, ఈమధ్య కొత్త ఇంట్లోకి మారెం, ఇక్కడ బాల్కనీ చాలా పెద్దదిగా ఉంది. అంతే ముగ్గువేసేద్దమని అనుకున్నాను , కానీ ముగ్గుపిండి ఇక్కడ దొరకదు కదా అని అనుకుంటుండగా అప్పుడు వెలిగింది. బియ్యపు పిండితో వేయవచ్చుకదా అని.
మొదటి రోజు వేసినపుడు ముగ్గుపిండితో వేసినంత బాగా రాలేదు కానీ తరువాతా బాగానే వచ్చింది.
జీన్స్ సినిమాలో రవేనా చలియా... పాటలో "డిస్నీలండులో కల్లపు చల్లి ముగ్గులు వేద్దం రా బామ్మ" లా ఈ దేశంలో బియ్యపుపిండి ముగ్గులు వేయడం చాలా సరదాగా ఉంది. నేనేప్పుడు కలలో కూడా అనుకోలేదు ఇలా జరుగుతుందని, చాలా సంతోషంగా ఉంది.

ఇంకో మంచి విషయం ఏమిటంటే రోజూ తిరుప్పావై చదువుతున్నాను. చాలా రోజుల తరువాత ఈ ధనుర్మాసాన్ని మహా బాగా జరుపుకుంటున్నాను

గ్రహవీక్షణము కన్న సద్గురువను గ్రహవిక్షణమే మిన్నా...........

1:44 PM Posted In Edit This 2 Comments »గ్రహవీక్షణము కన్న
సద్గురువను గ్రహవీక్షణమే మిన్నా.......

ఇహము పరము లేటులున్నా..
మహిలో గానము, గానము కన్నా.. ll గ్రహ..ll
మురిపెమలర వినవలేనన్న
మురళీ గానమే మిన్నా.. ll గ్రహ.. ll
రామ కృష్ణుల కన్నా..
ఏమివ్వగలను నేనింత కన్నా... ll గ్రహ.. ll

మొన్న మా టీవీ లో వచ్చిన శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారి కచేరీ చూసి, వినీ నా తనువూ, మనసు పులకరించి పోయాయి.
బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు
ఈ భూమి మీద పుట్టిన మనలాంటి మామూలు మనుషులని సంగీతంతో పునీతం చేయడానికి అవతరించిన గంధర్వులు శ్రీ మంగళం పల్లి వారు
ఆయనకాయనే ఒక ఉపమానం
అంతటి సర్వోతృష్టను మనందరి కోసం అవతరింపజేసిన ఆ పరమేశ్వరునికి ఇవే నా సాష్టాంగ ప్రణామాలు.

మొత్తం కచ్చేరీలో నాకు ఈ గ్రహవీక్షనముకన్న...అన్న పాట మహా బాగా నచ్చింది. దానితో పాటు,
ఎన్ని సార్లు విన్నా తనివితీరని
ఏమిసేతురా..లింగా.. ఏమీ సేతురా... పాట విని తరించి పోయాను
ఈ youtube పుణ్యమా అని ఎప్పుడూ వినాలనిపిస్తే అప్పుడు విని పునీతనవుతున్నాను
నా ఈ జీవిత కాలంలో ఈ లాంటి మహోన్నత వ్యక్తిని కన్నులారా చూసే బాగ్యాన్ని ప్రసాదించమని ఆ పరమేశ్వరునికి వేడుకొంటున్నాను.

భలే ఉంది...!

2:48 PM Edit This 4 Comments »

నాకు చిన్నపాటి నుంచి మామిడి పండ్లన్నా, ఆపిల్ పండ్లన్నా చాలా ఇష్టం.
అమెరికాకి వచ్చిన కొత్తల్లో రోజుకి మూడు, నాలుగు ఆపిల్ పండ్లు తినేదాన్ని, ఈ ఏడాదిన్నరలో ఇక్కడ దొరికే అన్ని రంగుల ఆపిల్ పండ్లని తినేశాను. ఇప్పుడు ఆపిల్ పండంటేనే విరక్తి పుట్టింది :)
అందుకే మొన్న పండ్ల కొట్టుకి వెళ్ళినప్పుడు ఈ కొత్త పండుని తీసుకొచ్చా , ఎలాఉంటుందో అనుకుంటూ ఇంటికి తెచ్చా .

ఎంత బాగుందో ..!
ముమ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్ సూపర్ :)
దాని రంగు, లోపల ఉన్న గుజ్జు ఎంత బాగుందో
అంతే వెంటనే లప్తోప్ ఓపెన్ చేసి దాని గురించి చదవడం మోడులేట్ట

దీని పేరు perssimon or japanese kaki
దీనిలో బోలెడన్ని విటమిన్ లు ఉన్నాయట
ఇది ఆపిల్ కంటే మంచి పండట
ఇది చైనా లో ఎక్కువగా పండుతుందట
------------------------------------------------
-----------------------------------------------
అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఇండియాలో అసలు పండదు :(
దీన్ని చూడగానే మనసుకెంతో బాధగా అనిపించింది
వెంటనే వెళ్లి ఏడుపు మోఘంతో ఇది ఇండియాలో ఎక్కడా పండదట అని మావారితో చెప్పా
ఆయన నవ్వుతూ ...
ఇకందుకు ఆలస్యం కాని ఉన్నన్ని రోజులు ఈ పండ్లని కుమ్ము అన్నారు :)
ఇప్పుడు ఆపిల్ స్థానంలో ఈ పెర్స్సిమోన్ వచ్చేసింది :)