మంగళవార పూజాఫలం
2:09 PM Posted In జ్ఞాపకాల పందిరి Edit This 4 Comments »శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం
త్రిశక్తి రూపిణీం అంభాం దుర్గాం చంఢీం నమామ్యహంనేను ప్రస్తుతం ఇంత సుఖంగా, సంతోషంగా ఉన్నానంటే ఆ అమ్మ కృపే...
ఒక ఆడపిల్లకి చదువు, అందం , ఉద్యోగం ఉన్నా మంచి భర్తా,మంచి అత్తమామలు,కలగటమే అదృష్టంగా భావిస్తాను .నాకు అటువంటి అదృష్టం కలుగజేసింది ఆ అమ్మ .
నాన్న పోయాక ఒక సంవత్సరానికి నా చదువు పూర్తైయింది. ఇక ఉద్యోగప్రయత్నాలు యస్ .బి.ఐ. క్లర్కు
పోస్టుకి ప్రెపేరయ్యాను ,కానీ నాకు రాలేదు. ఎలాంటి సమయంలో నాకొక పెళ్ళిసంభందం వచ్చింది . అమ్మకీ, అన్నయ్యకీ, తాతయ్యకీ చాలా బాగానచ్చింది. నాకుకూడా మావారు నచ్చారు .నిజం చెప్పాలంటే అదిచాలా పెద్ద సంభందం .అమ్మ చాలా భయపడింది, కట్నం అడుగుతారేమోనని . కానీ ముందు జాతకాలు చూడాలి కదా ..నాకు అప్పటివరకూ జాతకం వ్రాయలేదు ,కేవలం పుట్టీనతారీకు ,టైము తెలుసు. సరే జాతకం రాయించటానికి మా మేనమామ ,తాత వెళ్ళారు. నా జాతకం చూసినాయాన నాకు 2009కానీ, 2011లో కానీ కళ్యాణం జరుగుతుందనిచెప్పారు కానీ నాకు అప్పుడు రాహువు సరిగాలేదని , నన్ను 22 మంగళవారాలు రాహుకాలంలో ఉపవాసంతో నిమ్మకాయ దీపాలు వెలిగించి, బెల్లం నైవేధ్యంగా పెట్టమన్నారు .
అలానే నేను ఐదోవారం పూజచేసి లేవగానే పెళ్ళివారినుంచి ఫోను అమ్మాయి మాకు నచ్చింది కట్నం కూడా వద్దూఅని...
తరువాత ఒక 2 గంటలకి మా అన్న ఫోను చేసి వాడికి యన్.టి.పి.సి. లో ఉద్యోగంవచ్చిందని చెప్పాడు. అంతే మా ఆనందానికి అవధులు లేవు .
నాకు, అమ్మకీ ఇదంతా ఆ అమ్మ కృపేనని అనిపించింది . ఆ అమ్మ ఐదువారాలకే అంతటి దయ చూపింది మాపైన .
ఎలా 22 వారాలు పూర్తి కాగానే మార్చి 12, 2009 లో నాకు మా వారితో వివాహం అయ్యింది . మా అత్తగారు కూడా ఈ పూజ 6 సంవత్సరాలనుండి చెస్తున్నారట. ఆ తల్లినీ, ఆమెచూపిన కృపనూ ఏరోజూ మరువను .
మీరు కూడా ఈ పూజ చేసి ఆ తల్లి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను ....
4 comments:
naku ee pooja cheyalani chala eestam,kani eekkada yala cheyalu teliyadu, kocham cheeparu,koncham vivaramga cheepparu,
eekada ante amiricalo
ముందుగా పసుపు విఘ్నేశ్వరుడికి పూజచేసి, తర్వాత నిమ్మకాయలని మద్యకి కోసి వాటికి కుంకుమ పూసి రసంపిండాలి.
ఇప్పుడు వాటిని వెనక్కి తిప్పి వచ్చిన గుంటల్లో నూనె పోసి కుండ ఒత్తులను వేసి దీపాలు వెలిగించాలి .దీపాలు ఎనైనా వెలిగించవచ్చు .
ఇప్పుడు మాములుగా సంకల్పము , అమ్మవారి పటానికి దుర్గా అధాంగ పూజ , అష్టోత్రము(కుంకుమతో) చేసికొని దక్షణ తాంబూలాలు సమర్పించి చివరిగా నైవేధ్యం (బెల్లం) నివేదించి నీరాజనం ఇవ్వాలి .
కొంతమంది కథ చదువుతారు .కానీ అదినాకు తెలియదు .
నేను ఇలానేచేశాను .
మీకు ఏదైనా సందేహం ఉంటే వ్రాయండి, తెలుపగలను .
కామెంట్‌ను పోస్ట్ చేయండి