నాన్న కల నెరవేరింది
4:39 PM Edit This 3 Comments »
అన్నయ్యకి IES All India 129th rank వచ్చింది.
నాన్న కోరిక తీరింది. కాదు కాదు అన్నయ్య తీర్చాడు.
పుత్రోత్సహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సహంబు నాడు పొందుర సుమతీ!
అన్నట్టు, అన్నయ్య సాధించిన ఈ విజయానికి నాన్న ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తాడు .
అన్నయ్య ఇంజనీరింగ్ చేరేసమయంలో ఇంట్లో పరీస్తితులు సరిగాలేవు . అమ్మ, తాతయ్య , మావయ్య అందరూ అన్నయ్యని డిగ్రీ లో చేర్చారు . నాన్న తన ఫ్రెండ్ దగ్గర అప్పుగా ( చేబదులుగా)డబ్బు తెచ్చి అన్నయ్యను సివిల్ లో చేర్చాడు. అప్పట్లో సాఫ్ట్వార్ మాంచి బూం లో ఉంది. అందరూ సివిలా ....? అని వ్యంగాస్త్రాలు సందించే వారు . పరీస్తితులు మరీ ఇబ్బందిగా మారిపోయాయ్. అప్పుడు కార్ కూడా అమ్మేసాం . ఆరోజు అన్నయ్య, నేను చాలా బాధ పడ్డాం. నాన్న అప్పుడు చెప్పారు . నువ్వు IES లో మంచి రంక్ తెచ్చుకొంటే అప్పుడు నీకు govt ఇచ్చే కారులో నన్ను ఎక్కిన్చినరోజు ఇప్పుడు పడే బాధకంటే వందరెట్లు ఎక్కువ సంతోష పడుతాను అని. ఈమాటలు నాకింకా గుర్తున్నై.నాపిల్లలు కూడా మేనమామలా మంచి తెలివితేటలూ, పట్టుదల ఉండాలి. వాటిని చూసి నేను, రవి కూడా ఆ ఆనందాన్ని పొందలనుకున్తున్నాను.
మహాకవి
3:02 PM Posted In నా అభిరుచి Edit This 5 Comments »
మృతిలోన ముగిసినా
చితిలోన రగిలినా
కడతేరి పోనిదీ మధురాను బంధం
ఎదవీడి పోనిదీ మమతానురాగం .
పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్నే రాయిలానిలిపే వాడు ఋషి
రాయిలాపడివున్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి
ఇలాంటి కవిత్వాన్ని కొందరే రాయగలరు.
అలాంటి కవిత్వాన్ని కొందరే ఆదరించాగలరు, ఆరాదించగలరు, ఆస్వాదించగలరు.
నీనేవరి గురించి చెబుతున్నానో మీకు అర్ధమయ్యిందా ?
హింట్ : ఇరవై తొమ్మిదేళ్ళ నాటి సినిమా లోనిది.
చెప్పుకోండి చూద్దాం.....!?
అందరికీ ఉగాది శుభాకాంక్షలు .
చితిలోన రగిలినా
కడతేరి పోనిదీ మధురాను బంధం
ఎదవీడి పోనిదీ మమతానురాగం .
పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్నే రాయిలానిలిపే వాడు ఋషి
రాయిలాపడివున్న ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి
ఇలాంటి కవిత్వాన్ని కొందరే రాయగలరు.
అలాంటి కవిత్వాన్ని కొందరే ఆదరించాగలరు, ఆరాదించగలరు, ఆస్వాదించగలరు.
నీనేవరి గురించి చెబుతున్నానో మీకు అర్ధమయ్యిందా ?
హింట్ : ఇరవై తొమ్మిదేళ్ళ నాటి సినిమా లోనిది.
చెప్పుకోండి చూద్దాం.....!?
అందరికీ ఉగాది శుభాకాంక్షలు .
శ్రీ వారికి చిత్రలేఖ
7:54 PM Posted In నా బొమ్మలు Edit This 7 Comments »
చాలా రోజుల తరువాత ....
ఎలా ఉన్నారు ?
నేను మాత్రం చాలా హుషారుగా ఉన్నా.
౨౦౧౧ జూన్ లో ఇండి యా కి వెల్లొ చ్చ .. అందుకు లేండి. అది జరిగి చాలా రోజులయ్యింది లేండి.
తరువాత బ్లాగు రాయటనికి కుదరలేదు.
మళ్లీ ఇవాళ కుదిరినది.
మొన్న మార్చి 12 మా పెళ్ళి రోజు .
ఆ సందర్భంగా మా వారికి నేనిచ్చిన ఒక చిరుకానుక ఇది . :)
చాలా కష్టపడి వేసాను. ఎలా ఉంది ?
ఎలా ఉన్నారు ?
నేను మాత్రం చాలా హుషారుగా ఉన్నా.
౨౦౧౧ జూన్ లో ఇండి యా కి వెల్లొ చ్చ .. అందుకు లేండి. అది జరిగి చాలా రోజులయ్యింది లేండి.
తరువాత బ్లాగు రాయటనికి కుదరలేదు.
మళ్లీ ఇవాళ కుదిరినది.
మొన్న మార్చి 12 మా పెళ్ళి రోజు .
ఆ సందర్భంగా మా వారికి నేనిచ్చిన ఒక చిరుకానుక ఇది . :)
చాలా కష్టపడి వేసాను. ఎలా ఉంది ?