ధనుర్మాసం

10:31 AM Edit This 4 Comments »
ఈ పేరు వినగానే నాకు ముందు గుర్తొచ్చేది నా పుట్టినరోజు ..తర్వాత ముగ్గులు ..ఇవి రెంటి కోసమే సంవత్సరం అంతా ఎదురుచూస్తా.
ఈ సారి మాత్రం ఆ రెండు సరిగా జరగలేదు..;( అమ్మవాళ్ళ దగ్గర లేకుండా జరుపుకున్న మొదటి పుట్టినరోజు ,అందుకే ఇంతబాధ ;(
పెళ్ళైన ౩ నేల్లకంతా అమెరికా వచ్చేసాను .అంతే ఇక్కడంతా కొత్త ,ఇక్కడ కిందంతా కార్పెట్ ఉంటుంది .ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి .ముగ్గు పెట్టడానికి కూడా ఉండదు..ఇన్నిరోజులు అంతగా అనిపించలేదు కానీ మొన్న ౧౬ తారీకు నుంచి మా వారిని తెగ విసిగించేస్తున్నాను .ఎప్పుడువేలదాం ఇండియాకి అంటూ ..
అంటే నువ్వు ముగ్గులు పెట్టడానికి ఇప్పుడు నేను ఇండియాకి రావాలా ..?అని కోపంగా అన్నారు. తర్వాత రోజు ఎలానో బాల్కనిలో చిన్న ముగ్గు పెట్టాను .కానీ ఒక గంటాగి చూస్తే గాలికి ,వర్షానికి మొత్తం పోయింది .నేను పడే బాధ చేడలేక మా వారు ఒక కాగితము ,పెన్ను తెచ్చి దానిమీద నా ప్రతాపాన్ని చూపించమన్నారు ..అవే ఈ ముగ్గులు
బాగున్నాయా .... ;)

4 comments:

జ్యోతి చెప్పారు...

స్రవంతిగారు

పుట్టినరోజు శుభాకాంక్షలు. (ఎప్పుడో మరి )మీ బ్లాగింట్లో ముగ్గులు పెట్టండి.పుట్టినరోజు జరుపుకోండి. మేమంతా వస్తాము కదా..

సిరిసిరిమువ్వ చెప్పారు...

స్రవంతి గారు
మీ బ్లాగు ఈ రోజే చూసాను. మీ ముగ్గులు చాలా చక్కగా ఉన్నాయి. మీ వంటల వీడియోలు కూడా బాగున్నాయి. మీ వ్యాఖ్యానం సరళంగా విపులంగా బాగుంది. ముఖ్యంగా గ్రేప్ జ్యూస్‌కి గ్లాసుల అలంకరణ చాలా బాగుంది. ఒక చిన్న సూచన వీడియోలతో పాటు తయారు చేసే విధానం కింద టెక్స్టుగా కూడా పెడితే బాగుంటుంది.

lakshmi sravanthi udali చెప్పారు...

ధన్యవాదములు...
పుట్టినరోజు ఐపోయింది లెండి...ధనుర్మాసం రోజు.
సిరిసిరి మువ్వ గారు చాలా థంక్స్ అండి చాలా మంచి సలహా ఇచ్చారు..;)

amulya చెప్పారు...

hiiiii sravanti garu......mee blog chala bagundhi....nenu modhati sari acha telugu lo unna blog chusanu....chala santhosham.....mee blog chusaka meedhi nellore ani telesindhi....madhi kooda nellore.....meeru rallu tho chesena bommalu bagunnai....nenu kooda try chesthanu......thank u for this blog