గుండ్రాయి బొమ్మలు

4:18 PM Posted In Edit This 9 Comments »
నేను డిగ్రీ చదివేప్పుడు అమ్మ,నాన్న డక్కిలి లో ఉండేవాళ్ళు ,అక్కడ ఈ గుండ్రాయిలని ఎక్కువగా అన్ని రకాలలో మొదటిసారి చూట్టం. ఎందుకోతెలిదు సముద్రానికి వెళ్ళినప్పుడు గవ్వలు ఎలా ఏరుకుంటామో అలా బోలెడు రాయిలు ఏరుకుని ఇంటికి తెచ్చను .
అంతకి ముందువారమే ఈనాడు వసుంధరా పేపరులో ఇలాంటి రాళ్ళతో తాబేలు బొమ్మని చేయటం ఎలానో రాసారని అమ్మ చెప్పింది.చూసాను ,కానీ నాకు మాత్రం ఎందుకో వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి చూడగానే లావుగా ఉన్న మనిషి కూర్చున్నట్టు అనిపించింది. :)
అప్పుడు వాటిని ఫెవికాల్తో అంటించి ఇలా చేసా ...

అవి అలా అంటుకోగానే చాలా సంతోషంగా అనిపించింది. ఇక వాటికి రంగులు వేసి ఇదిగో ఇలా తయారు చేసాను.


కొంపతీసి
ఇవి అవనుకునేరు.
ఇవి అవి కావు, అలానే ఉండే మరో జత .
అవి వాకాడులో మా అమ్మా దగ్గరున్నాయి .
ఇవి మొన్న సియాటెల్ సముద్రతీరానికి వెళ్ళినప్పుడు, అప్పుడుచూశానే.. అలాంటి గుండ్రాయిలే కనిపించాయి ,వాటితో చేశా .
ఇక మీకు చూపించకుండా ఉండటానికి మనసొప్పక ఇదిగో ...వీటిని బ్లాగులో పెట్టే .



ఎలాఉన్నాయి ....?
ఆనంద మానంద మాయనే ...మా తాతయ్యపెళ్ళికొడుకాయనే... మా అమ్మ్మమ్మ పెళ్ళికూతురాయనే

9 comments:

మాలా కుమార్ చెప్పారు...

చాలా చాలా బాగున్నాయి .

Bhãskar Rãmarãju చెప్పారు...

చాలా బాగున్నాయ్.

lakshmi sravanthi udali చెప్పారు...

Thank u
meeru kuda mee pillala daggara cheyinchandi

శ్రీలలిత చెప్పారు...

ఇంత గొప్ప కళాఖండాలను గుండ్రాయిబొమ్మలనకూడదండీ..అందరికీ టక్కున నచ్చే పేరు పెట్టాలి..ఉదాహరణకి..
షష్టిపూర్తి మహోత్సవం.. అనో
లేకపోతే
పడమటి వయసు పెళ్ళిముచ్చట.. అనో..ఇలాగ.... ఏమంటారు?

lakshmi sravanthi udali చెప్పారు...

haha....:)
thank u
mundu pettina bommalalaki ade pettanu
పడమటి వయసు పెళ్ళిముచ్చట..
chala bagundi :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

చాలా బాగున్నాయండీ.
ముందుగా మీరు చెప్పకపోతే అవి గుండ్రాళ్ళతో తయారుచేసిన బొమ్మల్లాగా అనిపించవు.

మా చిన్నప్పుడు మా ఎదురింటి మీద వుండే తాతయ్య,బామ్మ బొమ్మలు గుర్తొచ్చాయి మీ బొమ్మలు చూస్తుంటే...

lakshmi sravanthi udali చెప్పారు...

thanks raji garu

Sravan Kumar DVN చెప్పారు...

wonderful !

himaja చెప్పారు...

abooooo fans ekkuvaipoyaru nee bommalaki