మహా బాగా సాగిపోతున్న ధనుర్మాసం

12:56 PM Posted In Edit This 0 Comments »
నాకు ఈ ధనుర్మాసం అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఈ మాసంలోనే పుట్టాను.
మొన్న 16వ తారీకు ధనుర్మాసం ఆరంభం రోజున నా పుట్టిన రోజు.
పుట్టిన రోజు పోయిన ఎడాది లానే అమ్మవాళ్ళు దగ్గర లేకుండానే జరిగిపోయింది. అదేలా ఉన్నా,
ఈ ఎడాది ఒక శుభవార్త.
పోయిన ఎడాది కేవలం కాగితంకు మాత్రమే పరిమితమైన నా అందమైన రంగవల్లులు నేడు నేలమీద ప్రత్యక్షం అవుతున్నాయి .
అవును, ఈమధ్య కొత్త ఇంట్లోకి మారెం, ఇక్కడ బాల్కనీ చాలా పెద్దదిగా ఉంది. అంతే ముగ్గువేసేద్దమని అనుకున్నాను , కానీ ముగ్గుపిండి ఇక్కడ దొరకదు కదా అని అనుకుంటుండగా అప్పుడు వెలిగింది. బియ్యపు పిండితో వేయవచ్చుకదా అని.
మొదటి రోజు వేసినపుడు ముగ్గుపిండితో వేసినంత బాగా రాలేదు కానీ తరువాతా బాగానే వచ్చింది.
జీన్స్ సినిమాలో రవేనా చలియా... పాటలో "డిస్నీలండులో కల్లపు చల్లి ముగ్గులు వేద్దం రా బామ్మ" లా ఈ దేశంలో బియ్యపుపిండి ముగ్గులు వేయడం చాలా సరదాగా ఉంది. నేనేప్పుడు కలలో కూడా అనుకోలేదు ఇలా జరుగుతుందని, చాలా సంతోషంగా ఉంది.

ఇంకో మంచి విషయం ఏమిటంటే రోజూ తిరుప్పావై చదువుతున్నాను. చాలా రోజుల తరువాత ఈ ధనుర్మాసాన్ని మహా బాగా జరుపుకుంటున్నాను