భలే ఉంది...!

2:48 PM Edit This 4 Comments »

నాకు చిన్నపాటి నుంచి మామిడి పండ్లన్నా, ఆపిల్ పండ్లన్నా చాలా ఇష్టం.
అమెరికాకి వచ్చిన కొత్తల్లో రోజుకి మూడు, నాలుగు ఆపిల్ పండ్లు తినేదాన్ని, ఈ ఏడాదిన్నరలో ఇక్కడ దొరికే అన్ని రంగుల ఆపిల్ పండ్లని తినేశాను. ఇప్పుడు ఆపిల్ పండంటేనే విరక్తి పుట్టింది :)
అందుకే మొన్న పండ్ల కొట్టుకి వెళ్ళినప్పుడు ఈ కొత్త పండుని తీసుకొచ్చా , ఎలాఉంటుందో అనుకుంటూ ఇంటికి తెచ్చా .

ఎంత బాగుందో ..!
ముమ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్ సూపర్ :)
దాని రంగు, లోపల ఉన్న గుజ్జు ఎంత బాగుందో
అంతే వెంటనే లప్తోప్ ఓపెన్ చేసి దాని గురించి చదవడం మోడులేట్ట

దీని పేరు perssimon or japanese kaki
దీనిలో బోలెడన్ని విటమిన్ లు ఉన్నాయట
ఇది ఆపిల్ కంటే మంచి పండట
ఇది చైనా లో ఎక్కువగా పండుతుందట
------------------------------------------------
-----------------------------------------------
అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఇండియాలో అసలు పండదు :(
దీన్ని చూడగానే మనసుకెంతో బాధగా అనిపించింది
వెంటనే వెళ్లి ఏడుపు మోఘంతో ఇది ఇండియాలో ఎక్కడా పండదట అని మావారితో చెప్పా
ఆయన నవ్వుతూ ...
ఇకందుకు ఆలస్యం కాని ఉన్నన్ని రోజులు ఈ పండ్లని కుమ్ము అన్నారు :)
ఇప్పుడు ఆపిల్ స్థానంలో ఈ పెర్స్సిమోన్ వచ్చేసింది :)

4 comments:

satya చెప్పారు...

స్రవంతి గారూ, ఈ పళ్లు నార్త్ ఇండియా లో దొరుకుతాయి. మేము క్రిందటేడు simla వెళ్లినప్పుడు బోలెడు తిన్నాము.అక్కడ వీటిని 'జపాన్ ఫ్రూట్' అంటారు.

lakshmi sravanthi udali చెప్పారు...

ఓహో..!
అయితే ఇండియాలో కూడా దొరుకుతాయా
thank u satya garu

మంచు చెప్పారు...

మీరు ఫొటొ పెట్టింది హార్డ్ పెర్మిసాన్ కదా... వీటిలొ సాఫ్ట్ పర్మిసాన్ ఉంటుంది.... రుచి మన సపొటాకి దగ్గర లొ ఉంటుంది....చలా చాలా బాగుంటుంది. అదీ ట్రై చెయ్యండి :-)

lakshmi sravanthi udali చెప్పారు...

:)thank u
tappakunda try chestanu manchu garu