నాకు మొక్కలు పెంచడమంటే చాలా సరదా . ఇంట్లో అన్నీ చెట్లూ పెంచాలనుకొనే దాన్ని , కానీ కొన్ని చెట్లు ఎన్ని సార్లు వేసినా సరిగా వచ్చేవి కావు. అవి మళ్లీ వేసినప్పుడల్లా అమ్మ తిడుతూ ఉండేది, ఎందుకు వాటికి డబ్బు తగలేస్తావు అని కానీ ఇప్పుడు నాకు దానికి మంచి సలహా లభించింది మన ఈ టి.వి. లో వచ్చే అన్నదాత పుణ్యమా అని ..
వాటిని తెలుసుకున్న వెంటనే ఆ మొక్కలను తీసుకు వచ్చి పెంచేయ్యలని
పించింది :)
కానీ నేనిక్కడెక్కడో ఉండిపోతినాయే ..:( ఎమ్ చేద్దాం చెప్పండి. ఇక్కడ ఆ చెట్లు, మొక్కలు దొరికి చావవాయే. అప్పటికి ఇక్కడ దొరికే మొక్కలు, ఆకుకూరలు కొన్ని పెంచుతూనే ఉన్నాను. కానీ ఏ ఆరు, ఏడు కుండీలకు మించి ఈ బాల్కనిలో సరిపోవట్లేదు అందుకే నా ఈ ఆరాటాన్ని మీకు చెబుతున్నాను . మీకు వీలయితే కనీసం మీరైనా వేసుకొని ఆనందించండి :)
మొక్కలు నాటే ముందు మనం ఎన్ని మొక్కలు ఎన్ని కుండీలల్లో లేదా ఎన్ని మడులకింద నాటుతున్నమో చూసుకోవాలి. అటు పిమ్మట ప్రతి కుండీకి 15 kg ల ఎర్రమట్టి , 5 kg ల పశువుల ఎరువు , 1 kg వర్మీకంపోస్టు, 0.5 kg ల వేప పిండి , కలిపి కుండీని పూర్తిగా కాకుండా... కుండీ పై నుంచి 2 అంగుళాల లోతు ఉండే విధంగా నింపుకోవాలి. ఇప్పడు మనకు నచ్చిన పూల మొక్కలనూ , కూరగాయ మొక్కలను , ఆకుకూరలను వేసి పెంచవచ్చు.
నిమ్మ, జామ, మామిడి, బత్తాయి, ......ఇలాంటి చెట్లను కూడా ఇంట్లో ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం .
నేలమీద అయితే 3 అడుగుల మట్టిని 1x1 మీటరు మట్టి తీసివేసి అందులో ఇసుక, మట్టి, వర్మీకంపోస్టు, కలిపి వీటిని నాటుకోవాలి.
town , city లల్లో కింద ఎక్కువ స్థలం ఉండదు కనుక, ఇంటి డాబా మీద 3 అడుగుల ఎత్తు ఉండే తొట్టెలను ఏర్పాటు చేసుకొని అందులో పైన చెప్పిన వాటితో దానిని నింపి అందులో వీటికిని నాటుకోవచ్చు .
ఇలా చేయటం వల్ల ఇంటి లోపల చాలా చల్లగా కూడా ఉంటుంది.
* సంవత్సరానికి ఒకసారి జానెడు మట్టి తీసివేసి 5 kg ల వేప పిండి, 2 kg ల వర్మీకంపోస్టు వేసుకోవాలి.
* కాపర్ ఆక్సీ క్లోరైడ్, గైటాక్స్ అనే మందు నీళ్ళల్లో కలిపి ఆరు నెలలకోసారి చెట్టు మొదల్లో పోయటం వల్ల తెగుళ్ళు రాకుండా నివారించవచ్చు .
* కాపర్ ఆక్సీ క్లోరైడ్ , గైటాక్స్ పేస్టు చేసి చెట్టు మొదలు నుంచి 9 అంగుళాల ఎత్తు వరకు పూయటం ద్వారా కొమ్మ తెగుళ్ళను నివారించవచ్చు .
ఎలా చేయడం వల్ల ఇల్లు అందంగా ఉండటమే కాక కూరల, పండ్ల ఖర్చుని కూడా తగ్గించవచ్చు.
కుండీల క్రింద ప్లేట్లను ఉంచడం వల్ల నేలమీద మరకలు పడకుండా నివారించవచ్చు .
వీటిని పాటించి మీ పెరటిని కూడా అందంగా,ఆరోగ్యవంతంగా, ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను .